నవంబర్ 12న కార్తికేయ 'రాజా విక్ర‌మార్క‌' విడుదల

తెలుగు తెరపైకి నవంబర్ 12న కొత్త గూఢచారి రాబోతున్నాడు.యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో మన ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కార్తికేయ గుమ్మకొండ రెడీ అయ్యారు.

 Karthikeyan's 'raja Vikrammarkan' Released On November 12 , Raja Vikrammarkan, K-TeluguStop.com

ఆయన హీరోగా నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క‘.శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు.ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది.నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ’88’ రామారెడ్డి మాట్లాడుతూ “హీరో కార్తికేయ లేకుండా ‘రాజా విక్రమార్క’ సినిమాను ఊహించలేం.ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఇరగదీశారు.

యాక్టింగ్, యాక్షన్ సీన్స్ పరంగా ఆయనకు ‘రాజా విక్రమార్క’ నెక్స్ట్ లెవల్ సినిమా అవుతుంది.దర్శకుడు శ్రీ సరిపల్లికి తొలి సినిమా అయినా బాగా తీశాడు.

ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది.మేమంతా సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం.

త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం.నవంబర్ 12 థియేటర్లలో విడుదల చేయాలనేది మా ప్లాన్.

కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం కూడిన ఈ న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది” అని అన్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ “ఎన్ఐఏ ఏజెంట్‌ విక్రమ్ పాత్రలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారు.

ఆయన లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయి.కార్తికేయ కెరీర్‌లో బెస్ట్ లుక్‌ అని చెప్పొచ్చు.

స్క్రీన్‌ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.స్క్రిప్ట్‌కి అనుగుణంగా ఎక్కువ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేశాం.

ఒక్కోసారి ఒక్క షాట్ కోసం ప‌ర్టిక్యుల‌ర్ లొకేష‌న్‌కు వెళ్లి, పర్మిషన్ తీసుకుని షూటింగ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.కార్తికేయతో పాటు తనికెళ్ల భరణిగారు, సాయికుమార్ గారు, పశుపతిగారు, తాన్యా రవిచంద్రన్, హర్షవర్ధన్, సుధాకర్ కోమాకుల పాత్రలకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది.

ఇంపార్టెంట్ రోల్స్ క్యారెక్టరైజేషన్‌తో పాటు వాళ్ళు ఉపయోగించే వెహికల్స్, గన్స్ దగ్గర్నుంచి ప్రతి అంశంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నాం” అని అన్నారు.

Telugu Karthikeyan, Nia Vikram-Movie

కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, ఫైట్స్: సుబ్బు,నబా, పృథ్వీ శేఖర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్.పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ: ఆదిరెడ్డి.టి, నిర్మాత: ’88’ రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube