ఇదేంటి జగన్ ? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే ? 

వైసీపీ ని ఏదో ఒక విషయంలో కెలకడం, ఆ పార్టీ నాయకులు దానికి రెచ్చిపోవడం,  అదేపనిగా టిడిపిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, అనేక కేసులు నమోదు చేయడం, దానిద్వారా ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని,  ప్రజా పోరాటాలు చేసే పార్టీల గొంతు నొక్కాలని చూస్తోందని నానా రాద్దాంతం చేస్తూ… రాజకీయ మైలేజ్ పొందేందుకు ఎప్పుడు కాచుకుని కూర్చుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు.మంచో చెడో, ఏదో ఒక విషయంపై నిత్యం జనాల్లో తమ పార్టీ పేరు ప్రస్తావనకు వస్తే,  అదే తమకు రాబోయే రోజుల్లో మేలు చేస్తుందనే విషయాన్ని బాబు బాగా నమ్ముతారు.

 Although Jagan Tried To Damage The Tdp Politically It Was Not Possible Jagan, Ys-TeluguStop.com

        అందుకే మొదటి నుంచి ఆయన మీడియా పై దృష్టి పెట్టి , టిడిపి కార్యక్రమాలకు మంచి ఫోకస్ లభించేలా చేసుకుంటారు.కానీ 2019లో ఘోర ఓటమి టిడిపి చవిచూసింది.

వైసిపి అఖండ మెజారిటీతో 151 సీట్లు దక్కించుకోవడంతో పాటు,  టిడిపి జనసేన పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేల మద్దతు పొందగలిగింది.కిందపడ్డా పైచేయి నాదే అన్నట్టుగా వైసీపీపై ఏదో ఒక విమర్శ చేసి, దానికి ఆ పార్టీ నుంచి వచ్చే రియాక్షన్ ద్వారా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉంటారు.

సరిగ్గా ఇదే సమయంలో టిడిపి ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి వ్యవహారం ఆ పార్టీకి బూస్ట్ గా మారింది.ఈ విషయంలో వైసీపీ దోషిగా ప్రజలు మిగిలిపోయినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

జగన్ ను ఉద్దేశించి టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి చేసిన విమర్శలు విషయాన్ని ఎవరూ పట్టించుకోకుండా,  టిడిపి కార్యాలయం పై జరిగిన దాడి అంశాన్ని చర్చించుకుంటున్నారు .
   

Telugu Ap, Chandrababu, Congress, Jagan, Lokesh, Ysrcp-Telugu Political News

   అలాగే టిడిపి నేతల పైన, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన నమోదైన కేసులు వ్యవహారంపైనా , జనాల్లో ను రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.జగన్ పై దూషణలకు దిగితే ఏ విధమైన రియాక్షన్ ఉంటుందో చూపించేందుకు వైసిపి ప్రయత్నించినా, అది ఇప్పుడు టీడీపీకి బాగా లబ్ధి చేకూర్చే విధంగా చేయడంతో పాటు, ఆ పార్టీ నాయకుల్లో మరింత ఉత్సాహం పెరిగేందుకు దోహదం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube