కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్ పగ్గాలు స్వీకరించేది అతడే..?

ప్రస్తుతం పురుషుల టీ20 ప్రపంచ కప్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో టీమ్ ఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

 Will He Be The Next T20 Captain To Take The Reins After Kohli? Virat Kohli, New-TeluguStop.com

నిజానికి అతని కెరీర్లో టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే ఆఖరి కాబోతోంది.దీంతో అతని తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.దాదాపు అతని నియామకం లాంఛనమేనని విశ్వసనీయ సమాచారం.

ఈ పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్‌ ముగిసిన వెంటనే రోహిత్ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించనున్నట్లు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌ వర్గాలు వెల్లడించాయి.

కోహ్లీ ఒక బ్యాట్స్‌మన్‌గా మంచి ఆటగాడు అయినప్పటికీ మంచి కెప్టెన్‌గా ఉండలేకపోతున్నాడు.

ఇందుకు కారణం అతడు తన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేకపోవడమే.కెప్టెన్‌ అంటే ఓడిపోతున్నా సరే గెలుస్తామని ధీమా తోటి ఆటగాళ్లలో నింపాలి.

కానీ కోహ్లీ మాత్రం అందరికంటే ముందుగానే డీలా పడిపోయి బాధ వ్యక్తం చేస్తాడనే వాదనలు ఉన్నాయి.మరి ధోనీ తర్వాత అంతటి కూల్ కెప్టెన్ రోహిత్ శర్మ కాగలడా? కాలమే సమాధానం చెప్పాలి.

Telugu Ups, Rohit Sharma, Captian, Virat Kohli-Latest News - Telugu

ప్రస్తుతానికి టీమిండియాకు రోహిత్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు.ఐపీఎల్‌లో ముంబై టీమ్ ఐదుసార్లు విజేతగా నిలిచిందంటే అందుకు కారణం రోహిత్‌ శర్మ అనే చెప్పవచ్చు.రోహిత్ శర్మ ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ దాన్ని అత్యుత్తమ ఐపీఎల్ టీమ్ గా తీర్చిదిద్దాడు.

వన్డే, టీ20 ఫార్మాట్‌లను వదిలేస్తే.

టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు.టీమిండియా చరిత్రలో అత్యధిక టెస్టుల్లో విజయం సాధించి పెట్టిన టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీకి పేరుంది.

కోహ్లీ 65 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉంటే అందులో 38 విజయాలే ఉన్నాయి.టెస్టుల్లో విన్నింగ్ రేట్ ఈ స్థాయిలో సాధించడం కోహ్లీకి తప్ప మరెవరికి సాధ్యం కాలేదు అంటే అతిశయోక్తి కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube