దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి చెల్లెలు ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అని మీకు తెలుసా..?

చలన చిత్ర పరిశ్రమలో రాణించాలంటే డబ్బు, హోదా, చదువు, సంధ్యలతో పని లేదని కేవలం ప్రతిభ ఉంటే చాలని ఇప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని కొందరు సినీ సెలబ్రిటీలు నిరూపించారు.అయితే సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకోలేకపోయిన నటీనటులు కూడా చాలామంది సినీ పరిశ్రమలో ఉన్నారు.

 Telugu Veteran Music Director Mm Srilekha Family And Cine Career Details, Mm Sri-TeluguStop.com

కానీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వారికి అవకాశాలు తొందరగా వచ్చినప్పటికీ సినిమాలు ఫ్లాప్ అవడంతో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు.కానీ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బాగానే రాణిస్తున్నారు.

అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓటమి అంటూ ఎరుగని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోదరి ఎమ్.ఎమ్ శ్రీ లేఖ కూడా ఈ కోవకే చెందుతుంది.

కాగా ఎమ్.ఎమ్ శ్రీ లేఖ తెలుగు సినిమా పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది.ఈ క్రమంలో తెలుగు ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ అనే చిత్రంలోని పాటలని కంపోజ్ చేసి వచ్చీరావడంతోనే తన ప్రతిభను నిరూపించుకుంది.ఈ క్రమంలో పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసింది.

అయితే అప్పట్లో చాలా మంది సంగీత దర్శకులు మగవాళ్ళ కావడంతో అవకాశాల విషయంలో ఎమ్.ఎమ్ శ్రీలేఖ కి కొంతమేర గట్టి పోటీ ఉండేది.కానీ డబ్బు విషయంలో ఇతరులను నమ్మి దాదాపుగా 30 లక్షల రూపాయల వరకు నష్టపోయింది.

Telugu Mm Srilekha, Mm Keeravani, Music, Sri Lekha, Ss Rajamouli, Teluguveteran,

దీంతో కొంత కాలం పాటు ఆర్థిక ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ బాగానే నిలదొక్కుకుంది.అయితే అప్పటికే తన సోదరుడైన ఎమ్.ఎమ్.కీరవాణి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నప్పటికీ అవకాశాల కోసం ఎప్పుడూ కూడా తన అన్న దగ్గరికి వెళ్లలేదు.అలాగే పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత అవకాశాలు లేని సమయంలో మళ్లీ ప్లేబ్యాక్ సింగర్ గా కూడా పని చేస్తూ పలు పాటలను పడింది.

Telugu Mm Srilekha, Mm Keeravani, Music, Sri Lekha, Ss Rajamouli, Teluguveteran,

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఎమ్.ఎమ్ శ్రీలేఖ తెలుగులో 30 కి పైగా చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసింది.ఈ క్రమంలో కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం తదితర భాషలలో కూడా పలు చిత్రాలకు సంగీత స్వరాలు అందించింది.కాగా చివరిగా 2017వ సంవత్సరంలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన శ్రీ వల్లి అనే చిత్రానికి సంగీత స్వరాలను సమకూర్చింది.

ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఎమ్.ఎమ్ శ్రీలేఖ నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube