టీడీపీలో ఆ మాజీ మంత్రికి ఏమైంది.. ఎందుకీ సైలెంట్‌

ఒక‌ప్పుడు టీడీపీ అంటే ఫైర్ బ్రాండ్ నేత‌ల‌తో నిండి ఉన్న పార్టీ.రాజ‌కీయ కురు వృద్ధుల‌కు నెల‌వుగా మారిన పార్టీ.

 Former Minister In Tdp Ganta Srinivas Rao, Tdp,ap News,ap Politics-TeluguStop.com

ఆ పార్టీలో ఉన్న వారంతా కూడా రాజ‌కీయంగా ఆరితేరిన చాణ‌క్యులే.కానీ ఎప్పుడైతే 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయారో అప్ప‌టి నుంచే రాజ‌కీయంగా క‌నుమ‌రుగ‌యిపోయారు చాలామంది నేత‌లు.

పోనీ వారేమైనా కొత్త నేత‌లా అంటే అది కూడా కాదు.రాజ‌కీయంగా ఎంతో అనుభవం ఉన్న వారే ఒక్క ఓట‌మితో క‌నిపించ‌కుండా పోయారు.

ఇప్పుడు టీడీపీ విశాఖ జిల్లా రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి కూడా ఇదే విధంగా సైలెంట్ అయిపోయారు.

ఆయ‌నే గంటా శ్రీనివాసరావు.

ఈయ‌న ఒక‌ప్పుడు ఎంత చురుగ్గా రాజ‌కీయాలు చేసేవారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రిగా నిత్యం మీడియాలో క‌నిపించేవారు.

అలాంటి నేత రెండేళ్ళుగా మౌనంగా ఉంటున్నారు.అటు పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పెద్ద‌గా యాక్టివ్ గా క‌నిపించ‌ట్లేదు.

ఇంకోవైపు వైసీపీ మీద కూడా ఎలాంటి కామెంట్లు చేయ‌ట్లేదు.దీంతో ఆయ‌న రాజకీయ దారి ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.

ఆయ‌న ఫ్యూచర్ ప్లాన్స్ పై కూడా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద అనుమానంగానే ఉంది.

Telugu Ap, Chandra Babu, Cm Jagan, Tdp-Telugu Political News

ఇంకోవైపు టీడీపీనే ఆయ‌న్ను దూరం పెడుతోంద‌న్న వాద‌న కూడా బ‌లంగానే వినిపిస్తోంది.అయితే ఇప్పుడు ఆయ‌న రియాక్ట్ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.మొన్న టీడీపీ కేంద్ర ఆఫీస్ మీద జ‌రిగిన దాడుల నేప‌థ్యంలో ఆయ‌న ఏకంగా సీఎం జగన్ కే లేఖ రాసి త‌న వాయిస్ వినిపించేశారు.

కానీ ఈ లేఖ‌లో టీడీపీ వాయిస్ మాత్రం బ‌లంగా వినిపించ‌లేదు.కేవ‌లం దాడులు అవ‌స‌ర‌మా అన్న‌ట్టు మాత్ర‌మే రాసుకొచ్చారు.కానీ ఫైర్‌ను మాత్రం ఇందులో చూపించ‌లేక‌పోయారు.అలాగే టీడీపీ ఇచ్చిన బంద్ లో కూడా ఆయ‌న పాల్గొన‌లేదు.

దీంతో ఆయ‌న వ్య‌వ‌హారం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.ఒక్క ఓట‌మికే ఇంత‌లా కుంగిపోతున్నారా అనే భావ‌న కూడా వినిపిస్తోంది.

చూడాలి మ‌రి ఆయ‌న భ‌విష్య‌త్ రాజ‌కీయం ఏంటో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube