హుజూరాబాద్ లో ' కుల ' రాజకీయం ? వారే దిక్కా ?

హుజురాబాద్ లో జరగబోతున్న ఉప ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం మాత్రమే సమయం ఉంది.దీంతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే విషయంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి.

 Huzurabad Elections, Trs, Bjp, Congress, Revanth Reddy,hujurabad Caste Politics-TeluguStop.com

ఏ విధమైన ఎత్తుగడలు వేయడం ద్వారా ఓటర్లను సులభంగా ఆకర్షించి , తమ పార్టీ అభ్యర్థి గెలిచేలా చేసుకోవచ్చు అనే విషయం పైనే అన్ని పార్టీలు దృష్టిసారించాయి.టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను హైలెట్ చేస్తూ,  రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఏ రకమైన అభివృద్ధి చేస్తామనే విషయాన్ని పదే పదే చెబుతుండగా, బిజెపి కాంగ్రెస్ పార్టీలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అక్రమాలు, కెసిఆర్ వ్యవహారశైలి ఇవే అంశాలపై దృష్టి పెట్టి విమర్శలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఎన్నికల్లో గెలవాలంటే కులాలవారీగా బలం పెంచుకోవడం ఒక్కటే మార్గంగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి .అందుకే కులాల వారీగా ఓటర్ల ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గం ను దగ్గర చేసుకుని వారి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.దీంతో కుల సంఘాల నాయకులకు డిమాండ్ పెరిగిపోయింది.కుల సంఘాల నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు వారికి భారీగానే సొమ్ము ఖర్చు పెడుతూ, వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే పనుల్లో ప్రధాన పార్టీలు బిజీ అయిపోయయి.

కుల సంఘాల్లో మంచి పట్టున్న వారిని గుర్తించి వారి మద్దతు పొందే విధంగా అనేక రకాలుగా వారిని ప్రసన్నం చేసుకుంటున్నాయి.రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు.

Telugu Congress, Etela Rajendar, Hujurabad, Huzurabad, Revanth Reddy-Telugu Poli

 ఏ ఏ కులాలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి , ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలను రంగంలోకి అధికార పార్టీ దించుతోంది.ఇప్పటికే కొన్ని ఏజెన్సీలు కుల డేటాను సేకరించాయి .దీని లెక్కల ప్రకారం హుజురాబాద్ లో మొత్తం 2.25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.వారిలో దళితులే ఎక్కువగా ఉన్నారు.మొత్తం ఇక్కడ 45 వేల మంది కి పైగా దళిత ఓటర్లు ఉన్నారు వారి తరువాత పద్మశాలి 26 వేలు,  గౌడ 24 వేలు, ముదిరాజ్ 23 వేలు, రెడ్డి 22 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు.

దీంతో ఏ కులాలు ఏ ఏ పార్టీకి మద్దతుగా నిలబడబోతున్నాయి అనే విషయం పైనే అన్ని పార్టీలు ఫోకస్ పెంచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube