అమెరికా వైద్యుల వినూత్న ప్రయోగం...మనిషికి పంది కిడ్నీ....

అవయవ దానం గురించి అందరికి తెలుసు ఎవరైనా వారి శరీరంలో ఏదైనా భాగం చెడిపోయినా, ఆ అవయవాన్ని తీసేయాల్సి వచ్చినా మరణించిన వ్యక్తి యొక్క అవయవాలని వారిలో ప్రవేశపెడుతారు.ఇది ముందస్తు ఒప్పందం ద్వారా జరిగే ప్రక్రియ.

 Pig Kidney Transplantation To Human In America , America , Pig Kidney, Brain De-TeluguStop.com

అయితే తప్పనిసరి సరి పరిస్థితులలో అత్యవసరంగా అవయవ మార్పిడి చేయాలంటే అప్పటికప్పుడు అవయవదానం చేసేవాళ్ళు దొరకని పరిస్థితిలో ముందస్తుగా ప్రత్యామ్నాయలపై ఏళ్ళ తరబడి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు.ఈ క్రమంలోనే జంతువుల అవయవాలు మనిషికి సరిపోతాయా, వాటి అవయవాలతో మనిషి ప్రాణం కాపాదవచ్చా అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు.

అయితే అమెరికా శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయంలో ముందడుగు వేసారనే చెప్పాలి.తాజాగా వారు చేసిన ప్రయోగం బిగ్ సక్సస్ అయ్యింది.ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఓ జంతువు అవయవాన్ని బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళకు అమర్చి విజయం సాధించారు, ఈ ప్రయోగం సత్పలితాలని ఇచ్చింది కూడా.వివరాలలోకి వెళ్తే.

అగ్ర రాజ్యం అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ళుగా జంతువుల అవయవాలు మనిషి అమర్చడంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.ముఖ్యంగా కిడ్నీ సంభందింత వ్యాధుల విషయంలో కోట్లాది మంది బాధపడుతుండగా, వారిలో కిడ్నీ మార్పిడి చేయించుకునే వారి సంఖ్య లక్షలలో ఉంటోంది.

కానీ అవయవదానం జరగడం మాత్రం తక్కువగా కనిపిస్తోంది.

Telugu America, Brain, Kidney, Organ, Pig Kidney-Telugu NRI

ఈ నేపధ్యంలో పంది కిడ్నీ మనిషికి సరిపోతుందా అనే విషయంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మానవ వ్యాధి నిరోధక శక్తికి సహకరించేలా పందిలో మార్పులు చేసి ఆ తరువాత పంది నుంచీ కిడ్నీ సేకరించి బ్రెయిన్ డెడ్ అయిన మహిళలో శాస్త్ర చికిత్స చేసి అమర్చారు.ఆ తరువాత మూడు రోజుల పాటు ఆమెలో కలుగుతున్న మార్పులను, కిడ్నీ పని తీరును పరిశీలించారు నూటికి నూరు శాతం మనిషి కిడ్నీ సహకరించినట్టుగానే పంది కిడ్నీ కూడా సహకరిస్తోందని, శాస్త్రవేత్తలు ద్రువీకరించుకున్నారు.ఈ తాజా ప్రయోగంతో మరిని అవయవాలపై పరిశోధనలు చేపడుతామని ఏ వ్యక్తి అవయవాలు సకాలంలో దొరక చనిపోవడం జరగకూడదని అదే తమ ప్రధమ ఉద్దేశ్యమని శాస్తవేత్తలు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube