బాలయ్య 'ఆహా' షో.. మరో అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌

నందమూరి బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ టాక్ షో కు రంగం సిద్దం అయ్యింది.బాలయ్య టాక్ షో ఏంటీ అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.

 Balakrishna Unstoppable Aha Talk Show Promo Soon-TeluguStop.com

అంత సీన్ లేదు.బాలయ్య టాక్ షో చేయనే చేయడు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు.

వారందరి నోళ్లు మూయించేలా ఆహా వారు స్వయంగా ప్రకటించారు.ప్రకటించడం మాత్రమే కాకుండా ఆహా భారీ కార్యక్రమంను చేసి షో ను అనౌన్స్ చేయడం జరిగింది.

భారీ అంచనాలన నడుమ స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ అన్ స్టాపబుల్‌ షో కు సంబందించిన ప్రోమోను అంతా ఎంతో ఆసక్తిగా చూసేందుకు ఎదురు చూస్తున్నారు.అన్‌ స్టాపబుల్‌ లో వచ్చే మొదటి గెస్ట్‌ ఎవరు అంటూ.

అసలు ఈ షో ఎలా సాగుతుంది అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బాలకృష్ణ నుండి రాబోతున్న అన్ స్టాపబుల్ షో కు సంబంధించి మరో అప్ డేట్‌ ను ఆహా ఇవ్వడం జరిగింది.

ప్రోమో ను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా ఈ వీడియోను షేర్‌ చేసింది.అలాగే ఆహా అన్ స్టాపుబుల్‌ కోసం వేసిన సెట్టింగ్‌ ను కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

బాలయ్య క్రేజ్ కు తగ్గట్లుగా ఆహా అనిపించేలా ఈ షో కోసం సెట్‌ ను డిజైన్ చేయడం జరిగింది.అన్నపూర్ణ స్టూడియో లో ఈ సెట్‌ ను నిర్మించినట్లుగా పేర్కొన్నారు.

రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రోమోను ఇవ్వబోతున్నారు.ఇదే జోరులో వచ్చే దీపావళి సందర్బంగా మొదటి ఎపిసోడ్ ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

సమంత టాక్ షో తరహా లోనే వారం కు ఒక ఎపిసోడ్‌ చొప్పున స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఈ షో మరో లెవల్‌ లో ఉంటుందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube