ఫలించిన భారత దర్యాప్తు సంస్థల కృషి : ఫిలిప్పీన్స్‌లో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ సురేశ్ పూజారి అరెస్ట్

భారతదేశంలో ఎన్నో నేరాలు, దారుణాలకు పాల్పడిన వారు వివిధ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.వీరిలో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, అండర్ వరల్డ్ డాన్‌లు, ఆర్ధిక నేరగాళ్లు వున్నారు.

 Mumbai Gangster Suresh Pujari Arrested In Philippines  , Suresh Pujari , India,-TeluguStop.com

దావూద్ ఇబ్రహీం నుంచి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ వంటి వారు పలు దేశాల్లో తలదాచుకుంటున్నారు.వీరిని స్వదేశానికి రప్పించడానికి భారత దర్యాప్తు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

తాజాగా కరడుగట్టిన ముంబై గ్యాంగ్‌స్టర్ సురేశ్ పూజారిని ఫీలిప్పిన్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.బెదిరింపులు, దోపిడీ కార్యకలాపాలతో కొన్నేళ్ల క్రితం ముంబై, థానే, కళ్యాణ్, ఉల్లాస్ నగర్, డోంబివ్లి పాటు కర్ణాటకలో విధ్వంసం సృష్టించాడు సురేశ్ పూజారి.

ఇతని అరెస్ట్‌ వార్త తెలుసుకున్న వ్యాపారవేత్తలు, హోటల్ యజమానులు, వైన్‌షాప్ యజమానులు, కేబుల్ ఆపరేటర్లు ఊపిరి పీల్చుకున్నారు.

శెనెగల్ నుంచి రెండేళ్ల క్రితం బహిష్కరణకు గురైన సురేశ్ పూజారి .నాటి నుంచి ఫీలిప్పిన్స్‌‌లో తలదాచుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన వివరాలను భారత నిఘా ఏజెన్సీలు .ఇంటర్‌పోల్‌కు తెలియజేశాయి.వీటి ఆధారంగా ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేయడంతో.

ఫిలిప్పీన్స్ ఫ్యుజిటివ్ సెల్ అక్టోబర్ 15న అరెస్ట్ చేసింది.దీనికి సంబంధించి ఇంటర్‌పోల్, ఫిలిప్పీన్స్ అధికారులు.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు.అయితే పూజారి అరెస్ట్‌ను భారత అత్యున్నత అధికారులు ధ్రువీకరించాల్సి వుంది.

సురేశ్ పూజారిని ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలేషియాలలో అరెస్ట్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే ఏడాది క్రితం ముంబైలోని తన అనుచరులతో ఫోన్ కాల్ మాట్లాడటంతో అతను ఇంటర్‌పోల్ రాడార్ కిందకు వచ్చాడు.

దీంతో దుబాయ్‌కి అక్కడి నుంచి ఆస్ట్రేలియా, మలేషియాలకు పారిపోయాడని ముంబై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.అతని ఆనుపానులకు సంబంధించిన వివరాలను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు సమాచారాన్ని పంచుకున్నాయి.

సురేశ్ పూజారి గ్యాంగ్ అరాచకాలు పెరిగిపోవడంతో ముంబై పోలీసులు అతనిపై 2017, 2018లలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.ఉల్లాస్‌నగర్‌లో కేబుల్ ఆపరేటర్ సచానంద్ కరీరాను రూ.5 కోట్లు డిమాండ్ చేసిన సురేశ్ గ్యాంగ్.అతను డబ్బు ఇవ్వకపోవడంతో 2015లో కాల్చి చంపారు.

పూజారి కర్ణాటకలోని మల్పేకి చెందినవాడు.అతనికి 15, 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ముంబైకి వలస వచ్చి హోటల్‌లో పనికిచేరాడు.

అనంతరకాలంలో ఓ చిన్న కేసులో అరెస్ట్ అయిన సురేశ్ పూజారి.రవి పూజారి గ్యాంగ్‌ సభ్యులకు పరిచయం కావడంతో అతని దశ తిరిగింది.ఆ తర్వాత ఉల్లాస్‌నగర్‌లో గాంబ్లింగ్ క్లబ్‌ను ప్రారంభించాడు.2002లో రవి పూజారి .న్యాయవాది మజీద్ మెమెన్‌పై దాడి చేయడంతో తొలిసారిగా సురేశ్ పేరు వినిపించింది.ఈ కేసులో సురేశ్‌ పూజారిని ఎంసీవోసీఏ కింద అరెస్ట్ చేశారు.

గురువు రవి పూజారికి వీరాభిమాని అయిన ఆయన.తర్వాతి కాలంలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube