కేసీఆర్ పట్ల ప్రతిపక్ష పార్టీల వ్యూహం... అలా జరగడమే వారి లక్ష్యమా?

ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్షం మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ స్థానం కోసం ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.

 Opposition Parties' Strategy Towards Kcr ... Is That Their Goal Trs Party, Congr-TeluguStop.com

అయితే కెసీఆర్ ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఇక మూడో సారి  ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక ప్రతిపక్షాలు మరో ఇదు సంవత్సరాలు నెగ్గుకురావడం కష్టమే అవుతుంది.అయితే ప్రతిపక్షాలు ఇప్పుడు కెసీఆర్ ను ఎదుర్కోవడానికి ఒక పకడ్భందీ వ్యూహాన్ని రచిస్తున్న పరిస్థితి ఉంది. 

కెసీఆర్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కెసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించి టీఆర్ఎస్ ను ఓడించాలనేది ప్రతిపక్షాల ప్రధాన వ్యూహంగా అనిపిస్తోంది.అయితే ప్రజల్లో వ్యతిరేకతను సృష్టిస్తే లాభం జరిగే అవకాశం ఉంటుందనేది ప్రతిపక్షాల అభిప్రాయం.

అయితే ఇప్పటికే బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ రోజు రోజుకు బలపడుతున్న పరిస్థితి ఉంది.అయితే రాను రాను ప్రతిపక్ష పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

అయితే ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

Telugu Bandi Sanjay, Bjp, Congress, Etala Rajender, Huzurabad, Revanth Redy, Tel

కెసీఆర్ ప్రతిపక్ష పార్టీల చర్యల పట్ల ఏ మాత్రం బహిరంగంగా వ్యాఖ్యలు చేయకున్నా కెసీఆర్ మాత్రం తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.ఇప్పటికే కెసీఆర్ పై ముప్పై శాతం వ్యతిరేకత వ్యక్తమయిందన్న సర్వే నేపథ్యంలో ప్రతిపక్షాలు మరింత ఉధృతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది.దీంతో టీఆర్ఎస్ కూడా తప్పని పరిస్థితిలో ప్రజల్లో సానుకూల వైఖరి పెంపొందించడానికి దృష్టి సారించే అవకాశం ఉంది.

మరి ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య పోటీలో ఎవరిది పైచేయు అవుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube