కార్తికేయ 'రాజా విక్రమార్క' రిలీజ్ డేట్ ఫిక్స్..!

యువ హీరో కార్తికేయ లీడ్ రోల్ లో శ్రీ సరిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజా విక్రమార్క.మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ పెట్టుకున్న కార్తికేయ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.సినిమాలో కార్తికేయ ఎన్.ఐ.ఏ ఏజెంట్ గా నటిస్తున్నాడు.తన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న రాజా విక్రమార్క సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

 Karthikeya Raja Vikramarka Release Date Fix, Karthikeya , Raja Vikramarka , Rele-TeluguStop.com

సినిమాను నవంబర్ 12న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

చావు కబురు చల్లగా సినిమాతో నిరాశపరచిన కార్తికేయ రాజా విక్రమార్కతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే విలన్ గా కూడా చేస్తున్నాడు కార్తికేయ.తమిళంలో అజిత్ హీరోగా వస్తున్న వాలిమై సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు.

హీరో కం విలన్ గా కార్తికేయ యువ హీరోల్లో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.మరి కార్తికేయకు ఈ రాజా విక్రమార్క ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

 ఈమధ్యనే రాజా విక్రమార్క టీజర్ రిలీజ్ అవగా అది సినిమాపై అంచనాలు పెంచింది.తప్పకుండా సినిమా కార్తికేయ ఖాతాలో మంచి హిట్ గా నిలుస్తుందని నమ్ముతున్నారు చిత్రయూనిట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube