హుజూరాబాద్ పాలిటిక్స్ : రాజకీయ వేడి పుట్టిస్తున్న సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం లో జరగబోయే ఉప ఎన్నికలలో పైచేయి సాధించేందుకు బిజెపి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే అధికార పార్టీ టిఆర్ఎస్ దళిత బంధు పథకం ద్వారా నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.

 Bandi Sanjay Started His Election Campaign In Huzurabad Details, Bandi Sanjay, H-TeluguStop.com

కేవలం దళిత బంధు వల్ల మిగతా సామాజిక వర్గంలో వ్యతిరేకత రాకుండా,  ఆయా సామాజిక వర్గాలకు తగిన న్యాయం చేస్తామంటూ హామీలు ఇస్తోంది.ఏదో ఏదో రకంగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

అయితే దీనిని తిప్పికొట్టేందుకు బిజెపి సీరియస్ గానే రంగంలోకి దిగిపోయింది.
  జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారానికి దించి టిఆర్ఎస్ దూకుడుకు బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు.జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు కొత్త పిలుపు ఇచ్చారు.టిఆర్ఎస్ దగ్గర 20 వేలు తీసుకుని ఓటు మాత్రం బీజేపీకి వేయాలని ఓటర్లను కోరారు.

దళిత బంధు పథకం పేరుతో పేదల మధ్య టిఆర్ఎస్ చిచ్చు పెడుతోందని విమర్శించారు .దళిత బంధు బీసీలు వద్దన్నారని కెసిఆర్ అన్నాడని, దళిత బంధు పేరుతో పేదల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని సంజయ్ మండిపడ్డారు.  తమ పార్టీ ఎప్పుడూ దళిత బంధు ను వ్యతిరేకించలేదని, హైదరాబాద్ ఎన్నికల సమయంలో కూడా తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపించారు.
 

Telugu Bandi Sanjay, Dalitha Bandhu, Etela Rajender, Hujurabad, Huzurabad Bjp, T

అప్పుడు నిజం తేల్చుకుందామని భాగ్యలక్ష్మి ఆలయానికి రమ్మన్నా రాలేదు అంటూ చెప్పుకొచ్చారు.దళిత బంధు ఇవ్వమని మేము చెప్పామని, బ్యాంక్ అకౌంట్ లో వేసిన డబ్బులు తీసుకొనివ్వలేదు అంటూ సంజయ్ మండిపడ్డారు.దళిత బంధు పైసలు ఇవ్వమని తాను కూడా చెప్పనని, దళిత బంధు పై నీతి నిజాయితీ మీకు ఉందో లేదో ఏడాదిలో తేల్చుకుందామని టిఆర్ఎస్ నేతలకు సంజయ్ సవాల్ విసిరారు.

దళిత బంధు పథకం అమలు కాకుండా ఆగిపోవడానికి కారణం బిజెపి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదే కారణం అంటూ టిఆర్ఎస్ ప్రచారం చేస్తుండడం పైన మండిపడ్డారు.అసలు దళిత బంధు పథకం ను ఆపాలి అని ఈసీ ని తాము ఎప్పుడు కోరలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube