జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ పరిచయమయ్యి, జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ కార్యక్రమంలో ఉండగానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.
బిగ్ బాస్ తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ వివిధ కార్యక్రమాలలో ఎంతో సందడి చేస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.ఇకపోతే ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అరియానాతో ఎంతో చనువుగా ఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.
అయితే ఈ వార్తలన్నింటికి అవినాష్ చెక్ పెడుతూ తను అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.ఈక్రమంలోనే వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇలా ముక్కు అవినాష్ నిశ్చితార్థం తనకు, అరియానకి మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.ఇలా నిశ్చితార్ధం జరుపుకున్న అవినాష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.
అవినాష్ త్వరలోనే పెళ్లి చేసుకోవడంతో అతని ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.ఇప్పటికే హల్దీ ఫంక్షన్, మంగళ స్నానాలు చేయించడంతో వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే అవినాష్ పెళ్లి సంబరాలలో తన స్నేహితురాలు రాములమ్మ అలియాస్ శ్రీముఖి పాల్గొన్నారు.అవినాష్ హల్ది ఫంక్షన్ లో శ్రీముఖి ఎంతో సందడి చేశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు పెద్దఎత్తున అవినాష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.