'తమసోమ జ్యోతిర్గమయ' ట్రైలర్ ని చూస్తే 'వేదం' సినిమా గుర్తొస్తుంది! - డైరెక్ట‌ర్ క్రిష్‌

`తమసోమ జ్యోతిర్గమయ` ట్రైలర్ ని చూస్తే వేదం సినిమా గుర్తొస్తుందని అన్నారు సృజ‌నాత్మ‌క‌ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి. చక్కటి మాటలతో కనివిందు చేసే గ్రామీణ దృశ్యాలతో.

 Director Krish Launched Tamasoma Jyothirgamaya Trailer, Director Krish ,launched-TeluguStop.com

చేనేత, చేతి వృత్తులలో ప్రత్యేకంగా యువతలో సామాజిక స్పృహను కల్పించే విధంగా ఈ సినిమాని తెర‌కెక్కించార‌ని అన్నారు.ట్రైలర్ లో “ఊరుని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టు చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుంది“ అని ఆయ‌న ప్ర‌శంసించారు.

`తమసోమ జ్యోతిర్గమయ- ఒక నేత కథ` ట్రైల‌ర్ ఆవిష్క‌ర్త క్రిష్.విజువ‌ల్స్ ఆద్యంతం ఆక‌ట్టుకున్నాయ‌ని అన్నారు.

ఆనంద్ రాజ్ బేతి, శ్రావణి సెట్టి, జనార్దన్, ఆర్కే త‌దిత‌రులు న‌టించారు.విజయ్ కుమార్ బడుగు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఆయ‌నే ర‌చ‌యిత‌.అక్టోబర్ 29న ఈ సినిమా విడుద‌ల‌వుతోంది.

గుణాస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై త‌డ‌క ర‌మేష్ నిర్మించారు.

Telugu Anand Raj, Krish, Janardhay, Sravani Shetty, Tollywood-Movie

ప్రశాంత్ బిజె సంగీతం అందించ‌గా.సాయి కార్తీక్ గౌడ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌.ఈ చిత్రానికి DOP- ఎడిటింగ్- DI-శ్రావణ్ జి కుమార్.

సాహిత్యం – పెద్దింటి అశోక్ కుమార్, ప్రశాంత్ BJ, సాయి చరణ్, రంజని శివ కుమార్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube