దారుణంగా హీరోల పరిస్థితి.. వారికి విలువ ఉందా అసలు..!?

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా పోటీ ఉంటుంది.ఆ పోటీ తట్టుకోగలిగిన వారు మాత్రమే సదరు ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు.

 Tollywood Heros And Their Latest Updates, Tollywood Updates, Tollywood Mid Range-TeluguStop.com

ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రజెంట్ విపరీతమైన పోటీ ఉందని చెప్పొచ్చు.ఒకప్పుడు ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇంకా ఓ డజను మంది హీరోలు మాత్రమే ఉండేవారు.

కాని ఇప్పుటు అటువంటి పరిస్థితులు లేవు.యంగ్ హీరోలు రోజుకొకరు పుట్టుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

డిఫరెంట్ స్టోరిస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో కొత్త తరం వస్తున్నది.ఈ క్రమంలోనే పాత తరం వారితో పోటీపడి మరి తట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

లేదంటే వారి పరిస్థితి ఇక అంతే.అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి.

ఇకపోతే హీరోలకు హిట్ వచ్చిందంటే చాలు ప్రొడ్యూసర్స్ వారి వెంటపడే పరిస్థితులు ఇప్పుడు అంతగా లేవనే చెప్పొచ్చు.ఒకవేళ వారి వద్దకు వెళ్లితే రెమ్యునరేషన్ పెంచితే పరిస్థితి ఏంటనే అనుమానాలున్నాయి.

ముఖ్యంగా మిడ్ హీరోల పరిస్థితి వేరేలా ఉంది.సాంకేతికత బాగా పెరిగిన నేపథ్యంలో సామాన్యుడు కూడా హీరో అయే పరిస్థితులు ఉండగా, మిడిల్ ఏజ్‌డ్ హీరోల పరిస్థితి చాలా దారుణంగా ఉందట.

ఒకప్పుడు హీరోకు రెండు హిట్స్ వస్తే వరుస సినిమాలు చేసేందుకు ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చేవారు.కాని ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ అసలు లేవు.

దాంతో ఫ్లాపుల్లో ఉన్న హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండానే సినిమాలు చేస్తున్న పరిస్థితి ఉంది.

Telugu Directors, Heroes, Producers, Tollywoodflop, Tollywoodmid, Tollywood, Tol

ఒకవేళ సినిమా హిట్ అయితే లాభాలు వస్తేనే వారు షేర్స్ తీసుకుంటున్నారు.ఇక సినిమా ఫ్లాప్ అయితే అంతే సంగతులు.అలా హిట్ ఫార్ములా కోసం హీరోలు పరితపిస్తున్న పరిస్థితులున్నాయి.

ఏడాది అంతా కష్టపడి సినిమా తీస్తే అది హిట్ కావాలని మిడ్ రేంజ్ హీరోలు కోరుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే వారికి ఎలాగూ రెమ్యునరేషన్ ఉండబోదు.ఏడాదికి దాదాపుగా 190 సినిమాలు విడుదల అయితే అందులో కేవలం పది సినిమాలు సక్సెస్ అవుతుండటం గమనార్హం.దీనిని బట్టి మిడ్ రేంజ్ హీరోలకు అసలు ఇన్‌కమ్ సోర్స్ లేకుండా సంపాదన కష్టం అవుతుందన్న సంగతి గ్రహించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube