వారంలో ఒకే ఒక్క‌సారి ఈ ప్యాక్ ట్రై చేస్తే చుండ్రు స‌మ‌స్యే ఉంద‌డ‌ట‌!

చుండ్రు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో బాధిస్తున్న స‌మ‌స్య ఇది.కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, ఫంగల్ ఇన్ ఫెక్షన్, తల‌లోని నూనె గ్రంథులు స్రవించడం తగ్గి పోవడం, త‌ల స్నానం చేయ‌కపోవ‌డం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకు పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.అయితే కార‌ణం ఏదైనా.

 Natural Hair Pack, Dandruff, Hair Care, Hair Care Tips, Latest News, Long Hair,-TeluguStop.com

ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ సూప‌ర్ హెయిర్ ప్యాక్‌ను వారంలో ఒకే ఒక్క సారి వేసుకుంటే.చుండ్రు ఇట్టే తగ్గు ముఖం ప‌డుతుంది.

మ‌రి ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఆ సూప‌ర్ హెయిర్ ప్యాక్ ఏంటో చూసేయండి.ముందుగా ఎనిమిది నుంచి ప‌ది వ‌ర‌కు మందారం ఆకుల‌ను తీసుకుని శుభ్రం చేసుకోవాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మందారం ఆకులు, మూడు టీ స్పూన్ల‌ క‌ల‌బంద జెల్‌, ఒక ఎగ్ వైట్‌, రెండు స్పూన్ల మెంతులు, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ వేప నూనె వేసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు కొబ్బ‌రి నూనె లేదా మీరు ఏ నూనైతే వాడ‌తారో ఆ నూనెను మీ త‌ల‌కు అప్లై చేసుకోవాలి.

ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని త‌ల‌కు మ‌రియు జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయండి.

ఇలా వారంలో ఒక్క సారి చేశారంటే చుండ్రు స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.అంతే కాదు, ఈ అద్భుత‌మైన హెయిర్ ప్యాక్ వ‌ల్ల తెల్ల జుట్టు త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.ఒక వేళ తెల్ల జుట్టు ఉన్నా న‌ల్ల‌గా మారుతుంది.

మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గి.జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

Natural Hair Pack, Dandruff, Hair Care, Hair Care Tips, Latest News, Long Hair, Hair Fall - Telugu Dandruff, Care, Care Tips, Fall, Latest, Long, Natural Pack

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube