అందమేకాదు.. సేవలోనూ ముందే: ‘‘ మిస్ వరల్డ్ అమెరికా’’ శ్రీ‌షైనీకి మరో ప్రతిష్టాత్మక అవార్డ్

అందాల పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారి టార్గెట్ వుంటుంది.సినిమాలు, మోడలింగ్‌లతో దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే లక్ష్యంతో వుంటారు.

 Indo-american Feted For Service During Covid , Miss World America, Srishini, Wo-TeluguStop.com

అయితే ఒక యువతి మాత్రం తనకు సమాజం కూడా ముఖ్యమేనని తెలియజేసింది.ఆమె ఎవరో కాదు.

భారత సంతతికి చెందిన అమెరికన్ యువతి శ్రీషైనీ.ఇటీవలే మిస్ వరల్డ్ అమెరికా టైటిల్ గెలుచుకున్న ఆమెకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సంస్థ శ్రీషైనీని సత్కరించింది.కరోనా వైరస్‌పై నిర్విరామంగా పోరాటం చేసినందుకు గాను ఆమెను సర్టిఫికేట్ ఆఫ్ కమిట్‌మెంట్‌ను శ్రీషైనీకి బహూకరించారు నిర్వాహకులు.

వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీషైనీ.మిస్ వరల్డ్ అమెరికా కిరీటం పొందిన తొలి ఇండో అమెరికన్‌గా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే.ఇంతటి ఘనత సాధించిన ఆమె జీవితం పూల పాన్పు కాదు.ఇక్కడి దాకా రావడానికి షైనీ ఎన్నో కష్టాలు పడింది.గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ షైనీకి.12 ఏళ్ల వయసులోనే శాశ్వతంగా పేస్‌మేకర్ అమర్చారు.అంతేకాదు ఒక కారు ప్రమాదంలో షైనీ ముఖం కాలిపోయింది.కానీ మొక్కవోనీ దీక్షతో మామూలు మనిషి అయ్యింది.

Telugu Indoamerican, Ludhiana, America, Punjab, Shiny Harvard, Srishini, Stand,

లాస్ ఏంజిల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఫైనల్ పోటీలలో డయానా హేడెన్ శ్రీ షైనీకి కిరీటం ధరింపజేశారు.తద్వారా ప్రపంచస్థాయిలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి మహిళగా శ్రీషైనీ గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనన్నారు.దీని వెనుక కీలకపాత్ర తల్లిదండ్రులదే అయినా ప్రత్యకించి తన తల్లి మద్ధతు వల్లే ఈ వేదికపై నిలబడగలిగానని శ్రీషైనీ అన్నారు.కాగా, న్యూజెర్సీలోని ఫోర్ట్స్ సిటీలో 2018లో జరిగిన పోటీలలో శ్రీషైనీ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని కూడా గెలుచుకున్నారు.

Telugu Indoamerican, Ludhiana, America, Punjab, Shiny Harvard, Srishini, Stand,

పంజాబ్ రాష్ట్రం లూధియానాలో 1996 జనవరి 6న జన్మించారు శ్రీషైనీ.ఆమెకు ఐదేళ్లు వున్నప్పుడే షైనీ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.బాల్యంలో వున్నప్పుడే పేదరికాన్ని చాలా దగ్గరి నుంచి చూసిన ఆమె.పిల్లలకు అందమైన బాల్యాన్ని అందించాలనే సామాజిక బాధ్యతను స్వీకరించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.12 ఏళ్ల వయసున్నప్పుడు షైనీ హృద్రోగం బారినపడ్డారు.ఆమె హృదయ స్పందన నిమిషానికి కేవలం 20 బీట్స్‌గానే వుండేది.

దీంతో ఆమె మళ్లీ డ్యాన్స్ చేయడం కుదరదని వైద్యులు వారి కుటుంబానికి తెలిపారు.కానీ మొక్కవోనీ దీక్షతో శ్రీషైనీ గంటల తరబడి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్‌లో పట్టు సంపాదించింది.

షైనీ హార్వర్డ్ యూనివర్సిటీ, యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube