ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయమే.ఎన్నో ఏళ్ల నుంచి ప్రసారమవుతున్న జబర్దస్త్ షో మంచి క్రేజ్ తో దూసుకెళ్తుంది.
ఇప్పటికీ ఈ షో మంచి ఆదరణ లో ఉంది.ఇక ఇందులో పాల్గొనే కమెడియన్లు ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు.
కొందరు మాత్రం అక్కడే ఉండి పోతున్నారు.
ఇందులో లేడీ గెటప్స్ తో చాలామంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈమధ్య లేడీ ఆర్టిస్టులు కూడా జబర్దస్త్ లో అడుగులు పెడుతున్నారు.అలా మల్లెమాల జబర్దస్త్ షో వల్ల ఎంతోమంది కమెడియన్స్ కి ఒక దారి దొరికింది.
ఇక ఇందులో లేడీ గెటప్ తో బాగా నవ్వించే కమెడియన్ శాంతి స్వరూప్.ఈయన ఎక్కువగా లేడీ గెటప్ తోనే బాగా పేరు సంపాదించుకున్నాడు.
నిజానికి జబర్దస్త్ ద్వారా వచ్చే పారితోషకం చాలా తక్కువే.కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియదు.అలా కొంతమంది ఈ షో ద్వారా సంపాదించుకున్న డబ్బులు కూడా పెట్టుకొని తమ జీవనాన్ని సాగిస్తున్నారు.ఈమధ్య చాలామంది ఆర్టిస్టులు సోషల్ మీడియా ద్వారా కూడా సంపాదిస్తున్నారు.
అందులో యూట్యూబ్ లో తమ పేరు పై ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో తమ వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటున్నారు.వీటి ద్వారా కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు.
అందులో శాంతి స్వరూప్ కూడా ఒకరు.శాంతి స్వరూప్ కూడా యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తూ తన అభిమానులతో షేర్ చేసుకుంటాడు.అలా తను కేవలం జబర్దస్త్ లోనే కాకుండా కొన్ని కొన్ని ఈవెంట్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా సంపాదించుకుంటున్నాడు.దాంతో ఆ డబ్బులను కూడా పెట్టుకొని తాజాగా తనకు నచ్చిన కారును కొనుక్కున్నాడు.
గతంలో శాంతి స్వరూప్ ఆస్తి అంతస్తులు గురించి బాగా రూమర్లు వచ్చాయి.తనకి ఒక పెద్ద బిల్డింగ్ ఉందని అంతేకాకుండా కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆడి కారు కూడా ఉందని పుకార్లు రావడంతో అందులో కొంచెం కూడా నిజం లేదని తను అద్దె ఇంట్లో అద్దెకు ఉంటున్నానని కొన్ని కొన్ని సార్లు ఆటో కి డబ్బులు కూడా ఉండవని అలాంటిది ఆడి కారు ఎలా కొంటానని ప్రశ్నించాడు శాంతి స్వరూప్.
అలా శాంతి స్వరూప్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్న కూడా పట్టించుకోకుండా తన జీవన విధానం ఏంటో తానే చూసుకుంటున్నాడు.ఇక తాజాగా తాను కొన్న కారు ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.ప్రస్తుతం ఆయన కొన్న కార్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక ఈయన అభిమానులు ఆ కారు ఫోటోకు లైకులు కొడుతున్నారు.ఈ కారు ధర కొన్ని లక్షలలో ఉంటాయని టాక్ వినిపిస్తుంది.ఈయనకు సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది.