టీ20 వరల్డ్‌ కప్‌: 4 బంతుల్లో 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన బౌలర్..?

ఐపీఎల్‌ సందడి ఇంకా ముగియక ముందే టీ 20 వరల్డ్‌ కప్‌ క్రికెట్ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది.23 వ తారీకు నుంచి అసలు సిసలైన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.ప్రస్తుతానికి క్వాలిఫైయింగ్, వామప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.క్వాలిఫైయింగ్ రౌండ్ ఆడే ఆటగాళ్లు సంచలన రికార్డులు క్రియేట్ చేస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు.తాజాగా ఐర్లాండ్ బౌలర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు.

 T20 World Cup: The Bowler Who Created A Sensation By Taking 4 Wickets In 4 Balls-TeluguStop.com

క్వాలిఫయింగ్‌ రౌండ్‌ గ్రూప్‌ ‘ఎ’ లోని ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ల మధ్య తాజాగా ఓ మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌లో కర్టిస్‌ క్యాంఫర్‌ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. నెదర్లాండ్స్‌ బ్యాటింగ్ సమయంలో పదో ఓవర్‌లో వరుసగా నాలుగురు ఆటగాళ్లను కర్టిస్‌ అవుట్ చేశాడు.

పదో ఓవర్‌లోని రెండో బంతికి కోలిన్‌ అకెర్‌మాన్‌ (11)ను పెవిలియన్ కు పంపించిన కర్టిస్‌ మూడో బంతికి ర్యాన్‌ టెన్‌ డషెట్‌ (0)ను, నాలుగో బంతికి స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (0)ను, ఐదో బంతికి వాన్‌ డెర్‌ మార్వె (0)ను అవుట్ చేశాడు.దీంతో హ్యాట్రిక్ తో పాటు నాలుగు వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా కర్టిస్‌ చరిత్ర లిఖించుకున్నాడు.టీ20 ఇంటర్నేషనల్‌లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి ఐరిష్ ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు.ఇప్పటివరకు లసిత్ మలింగ, రషీద్ ఖాన్ మాత్రమే వరుసగా 4 వికెట్లు పడగొట్టారు.

ఇప్పుడు వారి జాబితాలోకి కర్టిస్‌ చేరిపోయాడు.

Telugu Balls, Crket, Kartis Camphor, Spotrs, Cup-Sports News క్రీడల

22 ఏళ్ల ఈ మీడియం ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.క్యాంఫర్‌ 10 వన్డేలు ఆడి 51.28 సగటుతో 359 పరుగులు సాధించాడు.అలాగే 8 వికెట్లు తీసాడు.జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన క్యాంఫర్‌ తన కెరీర్‌ని దక్షిణాఫ్రికాలో స్టార్ట్ చేశాడు.తర్వాత ఐర్లాండ్‌కు వచ్చి ఆ దేశం తరఫున క్రికెట్ ఆడడం ప్రారంభించాడు.ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ ప్లేయర్ గా అద్భుతాలు సృష్టిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube