విమానాల‌కు కాప‌లా ఉద్యోగాలు చేస్తున్న పందులు.. ఎక్క‌డంటే..?

ఉద్యోగం అనేది స‌గ‌టు మ‌నిషికి ఎంత ఇంపార్టెంటో క‌దా.అయితే ఈ రోజుల్లో ఉద్యోగం దొర‌క‌డం అంటే చాలా క‌ష్టం అయిపోయింది.

 Amsterdam Schiphol Airport Deploys Pigs To Keep Runway Away From Birds, Amsterda-TeluguStop.com

ఇంకా ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత అయితే ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి.ఇలాంటి తరుణంలో స‌గ‌టు మ‌నిషికి ఉద్యోగం అనేది పెద్ద క‌ల‌లాగే మారిపోయింది.

కానీ ఓ చోట మాత్రం ఏకంగా పందుల‌కు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు.అయితే జంతువులు ఉద్యోగం చేయ‌డం కొత్త విష‌య‌మేమీ కాదు.

ఇప్ప‌టికే కుక్క‌లు సైన్యంలో, ఇంకొన్ని చోట్ల గ‌ద్ద‌లు, పిల్లులు కూడా ఉద్యోగాలు చేస్తున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే.

కానీ మొద‌టిసారి ఇలా పందులు ఉద్యోగం చేస్తున్నాయి.

అది కూడా ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిఫోల్ విమానాశ్రయంలో.నిజానికి ఈ ఎయిర్ పోర్టు యూరోప్ దేశాల్లోనే మూడో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ఈ ఎయిర్ పోర్టుకు ప్యాసింజర్స్ వ‌స్తుంటారు.ఇంత ఘ‌నమైన ప్రాముఖ్య‌త ఉన్న ఈ ఎయిర్ పోర్టులో ఇప్పుడు ఓ వింత స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

ఎంత చేసిన ఆ స‌మ‌స్య తీర‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు ఆ సమస్యను ప‌రిష్క‌రించుకునేందుకు చివ‌ర‌కు పందులకు ఉద్యోగం ఇవ్వాల్సి వ‌చ్చింది.

Telugu Pigs, Deploys Pigs, Runway Birds, Pigs Duty-Latest News - Telugu

ఈ ఎయిర్‌పోర్టు చుట్టు పక్కల ఉండే ల్యాండ్‌లో చాలామంది వ్య‌వ‌సాయం చేస్తుంటారు.దాంతో అక్క‌డ‌కు ఆహారం కోసం పక్షులు, జంతువులు అధికంగా వ‌స్తుంటాయి.విప‌రీతంగా పక్షులు, బాతులు వ‌స్తూ ర‌న్ వేల మీద నిత్యం ఇబ్బంది క‌లిగిస్తున్నాయి.

దీంతో వచ్చి పోయే విమానాలకు అంత‌రాయం క‌లుగుతోంద‌ని అధికారులు వాటిని అరిక‌ట్టేందుకు పందుల‌ను తీసుకొచ్చారు.ఓ ఇరవై వ‌ర‌కు పందులకు బాతులు, ప‌క్షుల‌ను రాకుండా చూసే బాధ్య‌త‌ను ఇచ్చారు.

చుట్టు ప‌క్క‌ల పెరుగుత‌న్న పంట మొక్క‌ల‌ను పందులు తినేయ‌డంతో బాతులు అటువైపు రావ‌ట్లేదంట‌.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube