అమెరికా: ఆసుపత్రి నుంచి బిల్‌క్లింటన్ డిశ్చార్జ్... ట్రీట్‌మెంట్ చేసింది మన భారతీయుడే...!!

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు.హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన క్లింట‌న్‌.

 Dr. Alpesh Amin: The Physician Who Oversaw Bill Clintons Medical Team At Uc Irvi-TeluguStop.com

బొట‌న‌వేలుతో థంప్స‌ప్ సింబల్ చూపించారు.ఇక నుంచి న్యూయార్క్ లో ఆయ‌న ట్రీట్మెంట్ తీసుకోనున్నారు.

మంగ‌ళ‌వారం ఓ వ్యక్తిగత కార్య‌క్ర‌మానికి హాజ‌రైన బిల్‌ క్లింట‌న్.తనకు స్వ‌ల్ప అనారోగ్యంగా వుందని త‌న సిబ్బందికి తెలిపారు.

దీంతో వారు ఆయనను కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే.

ప్ర‌స్తుతం క్లింట‌న్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఇర్విన్ వైద్య వర్గాలు తెలియజేశాయి.

యూరిన్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్లే క్లింట‌న్ అనారోగ్యానికి గుర‌య్యార‌ని, ఇది వ‌య‌సు పైబ‌డిన వారిలో సాధారణంగా వ‌చ్చే స‌మ‌స్యే అని వైద్యులు స్ప‌ష్టం చేశారు.డాక్ట‌ర్ అల్పేశ్ అమీన్, డాక్ట‌ర్ లిసా బార్‌డాక్ నేతృత్వంలో క్లింట‌న్‌కు చికిత్స అందజేశారు.

డిశ్చార్జ్ సందర్భంగా డాక్ట‌ర్ అల్పేశ్ మీడియాతో మాట్లాడుతూ… బిల్‌క్లింటన్‌కు జ్వ‌రం త‌గ్గింద‌ని, ఆయ‌న తెల్ల ర‌క్త క‌ణాలు కూడా సాధారణ స్థితికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు.ఇకపై ఇంట్లోనే బిల్‌క్లింటన్ యాంటీబ‌యాటిక్స్ కోర్సును కొన‌సాగిస్తారని ఆల్పేశ్ వెల్లడించారు.

కాగా.క్లింటన్‌కు చికిత్స అందించిన డాక్టర్ ఆల్పేశ్ అమీన్ మన భారత సంతతికి చెందిన వ్యక్తి.ఆయనకు హాస్పిటల్ మెడిసిన్ విభాగంలో అంతర్జాతీయ గుర్తింపు వుంది.సొసైటీ ఆఫ్ హాస్పిటల్ మెడిసిన్ (ఎస్‌హెచ్ఎం) మేగజైన్ ప్రకారం.ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్‌లో.పలు హోదాలలో పనిచేశారు.

అమెరికాలోనే తొలిసారి హాస్పిటలిస్ట్ ప్రోగ్రామ్‌ను 1998లోనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు.అలాగే అకడమిక్ మెడికల్ స్కూల్, అకడిమిక్ మెడికల్ సెంటర్ వరల్డ్‌వైడ్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్‌కు మొదటి, ఒకే ఒక్క ఛైర్మన్‌గా వ్యవహరించారు.

Telugu Calinia, Dr Alpesh Amin, Dralpesh, Clinton, Irwin Medical, York, Northgat

గుజరాత్‌లోని బరోడాలో జన్మించిన డాక్టర్ ఆల్పేశ్.తన తొలి పుట్టినరోజు నాటికే ఆయన కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.1985లో కాలిఫోర్నియాలోని వాల్‌నట్ క్రీక్‌లో నార్త్‌గేట్ హైస్కూల్ నుంచి ఆయన పట్టభద్రుడయ్యాడు.అలాగే 1989లో యూసీ శానిడియోగో నుంచి బయో ఇంజనీరింగ్ పట్టా.1994లో చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ అనుబంధ ఫీన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ డిగ్రీని అందుకున్నారు.అంతేకాకుండా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హెల్త్‌కేర్‌ విభాగంలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఆల్పేశ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube