తెలంగాణలో ముందస్తు ఎన్నికలా ? .. క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్ !

చాలా రోజుల నుంచి తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ముందస్తు ఎన్నికల హడావుడి గురించిన చర్చ జోరుగా సాగుతూనే ఉంది.సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఇంత హడావుడిగా కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగే విధంగా చేస్తూ వస్తున్నారని, తెలంగాణలో బిజెపి,  కాంగ్రెస్ పార్టీలు మరింత బలం పెంచుకోకుండా ముందుగానే కేసీఆర్ తగిన వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతూనే ఉంది.

 Kcr Clarified That There Is No Idea Of Going For Earl Elections Telangana, Elect-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది.ముందస్తు ఎన్నికల  విషయంలో చోటుచేసుకుంటున్న ఊహాగానాలకు కేసీఆర్ చెక్ పెట్టారు.

తాజాగా జరిగిన టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించిన కేసీఆర్ ఎన్నికలకు ఇంకా రెండున్నరెళ్ల సమయం ఉందని, ఇప్పుడే ముందస్తు ఎన్నికల గురించిన చర్చ అవసరం లేదంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారతాయి అని, ఎంపీ స్థానాలను గెలుచుకోవడం పైనే పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని కెసిఆర్ ఆదేశించారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు.ఆ అవసరం మనకు లేదు.ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది.మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ కేసీఆర్ అందరికీ క్లారిటీ ఇచ్చారు.

Telugu Congress, Hujurabad, Janagarjana, Telangana, Telangana Cm, Trs-Telugu Pol

వచ్చే నెల 15 ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చేలా వరంగల్ లో విజయగర్జన సభ నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు టిఆర్ఎస్ శ్రేణులకు కెసిఆర్ సూచించారు.10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామం నుంచి బస్సులో అభిమానులు, పార్టీ కార్యకర్తలను తరలించాలి అని సూచించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఎన్నికల విషయంపైన కెసిఆర్ మాట్లాడారు.హుజురాబాద్ లో తప్పకుండా టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ గెలుస్తారని, అన్ని సర్వేల్లోనూ బీజేపీ కంటే 13 శాతం టిఆర్ఎస్ కే ఎక్కువగా ఆదరణ ఉన్నట్లు స్పష్టమైంది అని, ఈ నెల 26 లేదా 27 వ తేదీల్లో హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube