అలాంటి షాకింగ్ షరతులు పెడుతున్న హీరోయిన్ సమంత.. కెరీర్ కు ఇబ్బందేనా?

సాధారణంగా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సమయంలో హీరోలు, హీరోయిన్లు దర్శకనిర్మాతలకు కొన్ని షరతులు పెడతారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత చైతన్య విడిపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

 Heroine Samantha Shocking Conditions To Her Producers Details, Heroine Samantha,-TeluguStop.com

విడాకుల ప్రకటనకు కొన్ని రోజుల ముందు, కొన్ని రోజుల తర్వాత సమంత సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

రెండు ప్రముఖ బ్యానర్లలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత త్వరలోనే ఈ రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారు.

అయితే సమంత నిర్మాతలకు షాకింగ్ షరతులు పెట్టారని తెలుస్తోంది.విడాకుల ప్రకటన తర్వాత సమంత బయట ఎక్కడా కనిపించడం లేదు.సమంత ఇకపై తన సినిమాల షూటింగ్ ఎక్కువగా చెన్నైలోనే జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.

హైదరాబాద్ లో అయితే పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తాను షూటింగ్ లో పాల్గొననని సమంత తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

Telugu Divorce, Samantha, Naga Chaitanya, Producers, Tollywood-Movie

నిర్మాతలు సమంత షరతుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అయితే సమంత అభిమానులు మాత్రం సమంత ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.అయితే అదే సమయంలో సమంత కండీషన్లు కొందరు ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి.

Telugu Divorce, Samantha, Naga Chaitanya, Producers, Tollywood-Movie

ఈ షరతుల వల్ల సమంతకు, టాలీవుడ్ కు మధ్య దూరం పెరిగే ఛాన్స్ అయితే ఉందని చాలామంది భావిస్తున్నారు.హైదరాబాద్ లో ఇండోర్ లొకేషన్లలో షూట్ సాధ్యం కాకపోతే సెట్స్ వేయాలని సమంత నిర్మాతలకు సూచనలు చేసినట్టు సమాచారం.సమంత షరతుల వల్ల ఆమె కొన్ని మంచి సినిమాలను మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

విడాకుల ప్రకటన వల్ల సమంత కెరీర్ కు ఇబ్బందులు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube