న్యూస్ రౌండప్ టాప్ 20 

1.టిఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల

టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఆదివారం ఉదయం షెడ్యూల్ విడుదలైంది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.ఆలయ్ బలయ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్

Telugu Cm Kcr, Corona, Kcr, Sv, Telangana, Telugu, Todays Gold, Top-Latest News

 దత్తన్న అలాయ్ బలయ్ కార్యక్రమం జలవిహార్ లో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతున్నారు.కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

3.కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది.

4.తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

5.నేడు చార్మినార్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు

Telugu Cm Kcr, Corona, Kcr, Sv, Telangana, Telugu, Todays Gold, Top-Latest News

సండే ఫన్ డే తరహాలో ‘ ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ ‘ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రమంలో ఈ రోజు చార్మినార్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు సిటీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

6.రేపటి నుంచి ఏపీపీ హాల్ టిక్కెట్లు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షకు హాజరయ్యే  అభ్యర్థుల హాల్ టికెట్ల ను  సోమవారం నుంచి తమ వెబ్ సైట్ లో అందుబాటు లో ఉంటాయని , 23 లోగా డౌన్ లోడ్ చేసుకోవాలని పోలీస్ నియామక మండలి తెలిపింది.

7.రాష్ట్రమంతా దళిత బందు అమలు చేయాలి

తెలంగాణ వ్యాప్తంగా బంద్ పథకాన్ని అమలు చేయాలని హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

8.అవుటర్ రింగ్ రోడ్డు పై ట్రామా కేర్ సెంటర్లు

అవుటర్ రింగ్ రోడ్డు పై జరుగుతున్న ప్రమాదాలు క్షతగాత్రుల ప్రాణాలు నిలపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడ జాతీయ రాష్ట్ర రహదారులు అనుసంధాన ప్రాంతాల్లో ఆరు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.

9.షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని కొండా రాఘవరెడ్డి పాదయాత్ర

Telugu Cm Kcr, Corona, Kcr, Sv, Telangana, Telugu, Todays Gold, Top-Latest News

20వ తేదీన చేవెళ్ల నుంచి వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న ప్రజా ప్రస్థానం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి నేడు లోటస్ పాండ్ నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు.

10.కేటిఆర్ కు రాజాసింగ్ సవాల్

హైదరాబాద్ వరుస పరిస్థితులపై మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ చేశారు.నాతో పాటు మంత్రి కేటీఆర్ బైక్ రైడింగ్ రావాలని కోరారు.

11.తిరుచానూరు అమ్మవారి ఆలయ వేళల పెంపు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.కొత్త వేళల ప్రకారం ఉదయం 4:30 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ఏకాంత సేవ తర్వాత మూసివేయనున్నారు.

12.రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం గా ముగిశాయి.చివరి రోజు శుక్రవారం దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు.

13.‘మా ‘ ఎన్నికలపై ఆర్జీవీ కామెంట్స్

Telugu Cm Kcr, Corona, Kcr, Sv, Telangana, Telugu, Todays Gold, Top-Latest News

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ,(మా ) ఎన్నికలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ స్పందించారు.‘ మా ‘  మొత్తం ఎపిసోడ్ సర్కస్ లా ఉందని, సీని’ మా ‘ వాళ్లు సర్కస్ లాంటి వాళ్ళు అని ప్రజలకి నిరూపించారు అంటూ కామెంట్స్ చేశారు.

14.అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

పేదరిక నిర్మూలనకు ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది.

15.తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ లో చిరుత

తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యునివర్సిటీ లో ఓ చిరుత శనివారం తెల్లవారు జామున రోడ్డు దాటుకుని పొదల్లోకి వెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

16.జూ పార్క్ లో పులి మృతి

విశాఖ జూ పార్క్ లో ఓ ఆడ పులి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది.

17.టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్

టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరపున మంత్రులు నామినేషన్ సమర్పించారు.

18.భారత్ లో కరోనా

Telugu Cm Kcr, Corona, Kcr, Sv, Telangana, Telugu, Todays Gold, Top-Latest News

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 14,146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.ఏపీలో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

20.ఈ రోజు బంగారం ధరలు

Telugu Cm Kcr, Corona, Kcr, Sv, Telangana, Telugu, Todays Gold, Top-Latest News

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,070

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,070

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube