చిరంజీవితో వర్మకు వైరం ఎలా మొదలయ్యిందో తెలుసా.?

రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఇతడు ట్విట్టర్ ముందు కూర్చొని వివాదాస్పద విషయాల గురించి మాట్లాడ్డం.

 Reasons Behind Chiranjeevi And Rgv Fight, Chiranjeevi, Rgv, Ram Gopal Varma, San-TeluguStop.com

లేని గొడవలను కెలికి మరీ బయటకు తీయడం పరిపాటిగా మారింది. వివాదాస్పద దర్శకుడిగా ముద్ర పడిన ఈయన నిత్యం ఏ గొడవకు అగ్గిపుల్ల వేద్దామా? అని ఎదురు చూస్తుంటాడు.ప్రస్తుతం ఆయన తీస్తున్న సినిమాలు కూడా జనాలకు ఎక్కడం లేదు.ఎందుకు తీస్తున్నాడో ఆయనే అర్థం కాని పరిస్థితి నెలకొంది.అయితే.ఒకప్పుడు వర్మ తీరే వేరు.

అప్పట్లో ఆయన తీసిన శివ లాంటి సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది.నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలను తన సినిమాలతో అద్భుతంగా ప్రొజెక్ట్ చేయగలిగాడు.

అప్పట్లో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా.


అదే సమయంలో చిరంజీవి వరుస పరాజయాలతో చాలా నిరాశలో ఉన్నాడు.

ఈ అపజయాల నుంచి ఎలా బయట పడాలి అనుకున్నాడు.అదే సమయంలో ఈ విషయాన్ని అశ్వనీదత్ కు చెప్పాడు.

అశ్వనీదత్ వర్మతో సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు.అదే సమయంలో హిందీలో సంజయ్ దత్ తో కలిసి వర్మ ఓ సినిమా చేస్తున్నాడు.

అయితే తనకు ఓ కేసు విషయంలో శిక్ష పడి జైలుకు వెళ్లాడు.వర్మ ఖాళీ అయ్యాడు.

అప్పుడే చిరుతో సినిమా చేయాలని అశ్వినీ దత్ చెప్పాడు.అయితే సంజయ్ దత్ విడుదల అయితే మళ్లీ తన సినిమా కంప్లీట్ అయ్యాక ఈ సినిమా కంటిన్యూ చేస్తాను అనే కండీషన్ పెట్టాడు.


Telugu Chiranjeevi, Hitler, Ram Gopal Varma, Chiranjeevi Rgv, Rgv Chiranjeevi, S

ఈ కండీషన్ కు చిరంజీవి ఒప్పుకున్నాడు.అనుకున్నట్లుగానే హీరోయిన్ ఊర్మిళతో కలిసి చిరంజీవి సినిమా మొదలు పెట్టాడు.ఒక షెడ్యూల్ పూర్తియ్యింది.ఇంతలో సంజయ్ కి బెయిల్ వచ్చింది.దీంతో వర్మ ఈ సినిమా వదిలేసి ముంబై వెళ్లాడు.ఎంతకీ ఈ సినిమా చేయడానికి రాలేదు.

చివరకు ఈ సినిమా తను చేయలేనని చెప్పాడు.దీంతో చిరంజీవి బాగా కోపం వచ్చింది.

ఈ సినిమా కోసం తను 8 నెలలు వేస్ట్ చేశాడు.దీంతో ముత్యాల సుబ్బయ్యతో కలిసి హిట్లర్ సినిమా చేశాడు చిరంజీవి.

ఈ సినిమా విజయం సాధించడంతో.ఆ తర్వాత వర్మ వచ్చి చిరుతో సినిమా చేస్తానని చెప్పాడు.

కోపంతో ఊగిపోయిన చిరంజీవి.మళ్లీ తనకు కనిపించకూడదని వార్నింగ్ ఇచ్చాడట.

అప్పటి నుంచి చిరంజీవి కుటుంబంతో వర్మకు వైరం మొదలయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube