టీ20 ప్రపంచకప్‌లో వేరే దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు కుర్రాడు..!

భారత జట్టు తరఫున ఆడాలని హైదరాబాద్‌కు చెందిన ఓ కుర్రాడు కలలుకన్నాడు.అయితే భారత జట్టులో ఆడాలనే అతడి కల నెరవేరలేదు కానీ టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఛాన్స్ మాత్రం దక్కింది.

 Hyderabad Indian Cricket Player Srimantula Sandeep Goud Playing Cricket Behalf O-TeluguStop.com

హైదరాబాద్.అదీ మన తెలుగువాడైన ఈ యువ క్రికెటర్ టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఒమన్‌ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ హైదరాబాదీ ఆటగాడి పేరు శ్రీమంతుల సందీప్‌ గౌడ్‌ కాగా.అతడికి క్రికెట్ అంటే మహా ఇష్టం.

ఆ ఇష్టంతోనే క్రికెట్‌లో మంచి పట్టు సాధించి ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు.ఈ క్రమంలో ఒమన్ జట్టు తరఫున టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే అర్హతను సాధించాడు.

ఈరోజు మధ్యాహ్నం ఒమన్, పపువా న్యూగినియా జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో ఒమన్ తరఫున సందీప్‌ గౌడ్‌ ఆడబోతున్నాడు.

హైదరాబాద్‌లోని కవాడీగూడ నివాసి అయిన 29ఏళ్ల సందీప్ గౌడ్ 2016లో జాబ్ కోసం ఒమన్ దేశం వెళ్ళాడు.

తరువాత ఆ దేశంలోనే స్థిరపడిన సందీప్ దేశవాళీ క్రికెట్ మ్యాచుల్లో ఆడటం ప్రారంభించాడు.అయితే సందీప్‌ అద్భుతమైన ఆట ప్రదర్శనకు అబ్బురపడిన ఒమన్ దేశం అతన్ని తమ జాతీయ జట్టులో చేర్చుకుంది.

వాస్తవానికి సందీప్‌కి చిరు ప్రాయం నుంచే క్రికెటర్ అవ్వాలనే కోరిక ఉండేది.టీమిండియా మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ చదివిన ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌ లోనే సందీప్ చదువుకున్నాడు.వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్ఫూర్తితో క్రికెట్‌ను కెరీర్‌గా మలచుకునేందుకు అతడు టీనేజ్ వయసు నుంచే కృషి చేశాడు.2005-08 మధ్యకాలంలో హైదరాబాద్ అండర్-15, 19 జట్ల తరఫున ఆడాడు.చిక్కడపల్లిలోని అరోరా కాలేజీలో బీకామ్‌ చదువుకుంటూనే.ఉస్మానియా యూనివర్సిటీ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు.

Telugu Behalf Oman, Hyderabadindian, Indian Palyer, Latest Flash, Latest, Cricke

2009-10 సీజన్‌లో జరిగిన అండర్‌-22 కల్నల్‌ సీకే నాయుడు టోర్నీలో హైదరాబాద్‌ జట్టు విజయం సాధించగా అందులో సందీప్ కీలక భూమిక పోషించాడు.అంతేకాదు ఈ టోర్నీలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ గా నిలిచి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.అయితే ఆటలో మెరుగ్గా రాణించినప్పటికీ భారత్‌లో రంజీ పోటీల్లో ఆడే ఛాన్స్ మాత్రం దక్కలేదు.2013 నుంచి 2016 వరకు విశ్వప్రయత్నం చేశాడు కానీ అతన్ని అదృష్టం మాత్రం వరించలేదు.దీంతో చేసేది లేక 2016లో ఒమన్‌లోని ఖిమ్జి రామ్‌దాస్‌ కంపెనీలో ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసర్‌గా జాబ్ రావడంతో అక్కడికి మకాం మార్చాడు.

Telugu Behalf Oman, Hyderabadindian, Indian Palyer, Latest Flash, Latest, Cricke

అయితే జాబ్ చేసేందుకు విదేశానికి వెళ్ళినప్పటికీ క్రికెటర్ కావాలనే అతని ఆశ మాత్రం చచ్చిపోలేదు.దాంతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సందీప్ కృషి, పట్టుదలతో జాతీయ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు.ఇండియా జట్టు తరఫున ఆడే అవకాశం లభించకపోయినా ఒమన్ క్రికెటర్‌గా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు.

ఒమన్‌ డెవలప్‌మెంట్‌ ఎలెవెన్‌ తరఫున ఐర్లాండ్‌పై ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సందీప్ అద్భుత ఆటతీరుతో (55 నాటౌట్‌) ఆ దేశ జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో సందీప్ 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 2 కీలక వికెట్లు పడగొట్టి ఆశ్చర్యపరిచాడు.జాతీయ స్థాయి మ్యాచులో కూడా ఆడుతూ ఐసీసీలో చోటు దక్కించుకున్నాడు.

ఇప్పుడు ప్రపంచకప్‌లో ఒమన్ దేశ క్రికెటర్‌గా ఎదిగిన సందీప్.ఆ జట్టులో మోస్ట్ వ్యాల్యూ ప్లేయర్ కావడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube