ప్రభాస్ 'స్పిరిట్' కోసం షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు లైనప్ లో పెడుతూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు.ఎప్పుడు పాన్ ఇండియా సినిమా చేసే ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ ను టార్గెట్ చేస్తున్నాడు.

 Prabhas Shocking Remuneration For Spirit Movie, Prabhas Spirit,prabhas Spirit Mo-TeluguStop.com

ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నాయి.ఈ సినిమాలు పూర్తి కాకుండానే ఇంకా డైరెక్టర్లు వెంటపడుతూనే ఉన్నారు.

ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండగానే మరొక సినిమాకు ఓకే చెప్పి అందరిని ఆశ్చర్య పరిచాడు.

ప్రభాస్ కెరీర్ లో 25వ సినిమాను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ నుకూడా ఫిక్స్ చేసారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, యువీ క్రియేషన్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించ బోతున్నారు.

అయితే ఈ సినిమాకు ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.

Telugu Prabhas Spirit, Prabhas, Sandeepreddy-Movie

బాహుబలి సినిమాతోనే హైయెస్ట్ పైడ్ హీరోగా వార్తల్లోకి ఎక్కినా ప్రభాస్ ఇప్పుడు తన 25వ సినిమా స్పిరిట్ కోసం ఏకంగా 150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో తెరకెక్కుతుండగా ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇంత భారీ రెమ్యునరేషన్ పొందుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ 150 కోట్లు తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

బాలీవుడ్ హీరోలను కూడా తలదన్నే విషంగా ప్రభాస్ ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడంతో బాలీవుడ్ మీడియా సైతం ఆశ్చర్య పోతుంది.నార్త్ సినిమా 8 భాషల్లో తెరకెక్కుతుండటం మాములు విషయం కాదు.

కానీ ప్రభాస్ దీనిని సాధించాడు.మరి సినిమా స్టార్ట్ అవ్వకుండానే ఇంత మిరాకిల్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యే స్థాయికి ఇంకా అన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube