ప్రెజెంట్ ట్రెండ్ అంతా సోషల్ మీడియా వైపే నడుస్తుంది.ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింతలు, విశేషాలు జరిగినా గాని ఇట్టే సోషల్ మీడియాలో తెలిసిపోతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రజలు కూడా ఎక్కువగా సోషల్ మీడియా వైపే మొగ్గు చూపుతున్నారు.ఒక రకంగా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా ద్వారా చాలా మంది వ్యక్తులు ప్రపంచానికి పరిచయం అయ్యారు.
తమలో ఉన్న టాలెంట్ నలుగురికి తెలియాలని ఏవేవో వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.ఆ వీడియోలు కనుక నెటిజన్లను ఆకర్షిస్తే ఓవర్ నైట్ లోనే వైరల్ గా మారిపోతున్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక ఫన్నీ వీడియో గురించి మీకు చెప్పాలి.నిజానికి ఇది ఫన్నీ వీడియో కాదు.
కానీ అలవాటులో పొరపాటు మాదిరిగా ఒకటి చేద్దామని ఆ వ్యక్తి అనుకుంటే మరొకటి జరిగింది.
అసలు చేద్దామనుకున్న ఫీట్ వైరల్ అయ్యేదో లేదో తెలియదు కానీ.
అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ మాత్రం నెటిజన్లను ఒక రేంజ్ లో నవ్వులు పూయిస్తుంది.మరి ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దామా.
సినిమాల్లో నటించే హీరోలను చూసి వారి లాగా స్టైల్ గా ఉండాలని చాలామంది అనుకుంటారు.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి కొత్తగా ఆలోచించి రజనీకాంత్ స్టైల్లో ఏదో చేయాలనీ అనుకున్నాడు.
కానీ అది బెడిసి కొట్టి ముఖం పగిలిపోయింది.అసలు ఇంతకీ అతను ఏం చేసాడో చూద్దామా మట్టి తీసేందుకు ఉపయోగించే ఒక ఇనుప పారను తీసుకుని దానికి ఒకవైపు టోపీని ఉంచాడు.
దాన్ని రజనీకాంత్ స్టైల్లో తన తలపైకి వచ్చేలాగా ప్రయత్నించాడు.అలా ఓ వైపు పారకు ఆ టోపీని ఉంచి మరో వైపు పారను కాలితో తన్నాడు.అలా చేసే క్రమంలో సరిగ్గా టోపీ గాలిలోకి ఎగిరి అతని తలపై పడాలని అతని ఇంటెన్షన్.అయితే అక్కడ అతను అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.ఆ వ్యక్తి ఓ వైపు పారను బలంగా కాలితో తన్నగా రెండవ మొన అతని మొఖానికి బలంగా తాకడంతో ముఖం పగిలిపోయింది.అనుకోకుండా జరిగిన ఈ ఫన్నీ వీడియో నెటిజన్లకు బాగా నవ్వులు తెప్పిస్తోంది.
అనుకున్నది ఒక్కటి.అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.
అని కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు
.