బాల్క సుమన్ టార్గెట్ గా బీజేపీ కార్యకర్తల మాటల తూటాలు... అసలు వ్యూహం ఇదే

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలవాలన్నది టీఆర్ఎస్ ముందున్న ప్రధాన లక్ష్యం.

 Bullets Of Words Of Bjp Activists Targeting Balka Suman Details, Telangana Polit-TeluguStop.com

  ఎందుకంటే హుజూరాబాద్ అన్నది టీఆర్ఎస్ పార్టీ కంచుకోట.దుబ్బాకలో ఓటమితో టీఆర్ఎస్ కు ఎన్ని చిక్కులు వచ్చాయో మనం చూశాం.

పార్టీ ప్రతిష్ట కూడా మసకబారిన పరిస్థితి ఉంది.అందుకే ఈ ఉప ఎన్నిక విజయంపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.

అయితే ఈ ఎన్నికల్లో  టీఆర్ఎస్ తరపున హరీష్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే బాల్క సుమన్ కెటీఆర్ దూత అని రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న వ్యాఖ్య.

అయితే ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలో బాల్క సుమన్ పర్యటిస్తూ ఈటెలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే ఈ తరుణంలో బాల్క సుమన్ ను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూ తమ సోషల్ మీడియాలలో బాల్క సుమన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.

ఇందులో అసలు వ్యూహం ఏంటని ఒకసారి విశ్లేషిస్తే చెన్నూరు  నియోజకవర్గంలో వివేక్ సోదరుడు వినోద్ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది.

Telugu @balkasumantrs, @bjp4telangana, @ktrtrs, Bjp Vivek, Etela Rajender, Haris

అయితే రెండు సార్లు చాలా ప్రయత్నించినా అక్కడ టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడం వల్ల వివేక్ సోదరుడు వినోద్ గెలుపొందలేకపోయారు.ఆ తరువాత పక్కన ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయాల్సిన పరిస్తితి వచ్చింది.ఇప్పుడు బీజేపీలో కీలకంగా ఉన్న వివేక్ బాల్క సుమన్ టార్గెట్ గా చెన్నూరులో గెలుపొందాలనే ఉద్దేశ్యంతో హుజూరాబాద్ వేదికగా ఇటు టీఆర్ఎస్ ను, ఇటు బాల్క సుమన్ ను బలహీన పర్చాలన్నది బీజేపీ లక్ష్యం.

అందుకే బాల్క సుమన్ టార్గెట్ గా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube