ఆ గ్రామానికి గబ్బిలాలే గ్రామ దేవతలట.. వీటిని పూజిస్తే..!

సాధారణంగా మనం గబ్బిలాలను చూస్తేనే బయపడి దూరం జరుగుతాము.ఎందుకంటే వాటి నుండి కొత్త వైరస్ లు వ్యాపిస్తాయని భావించి వాటికీ దూరంగా ఉంటాం.

 Do You Know Bats Was Worshipped In Chittoor District Details, Bats, Andhra Prade-TeluguStop.com

కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఈ గ్రామంలో గబ్బిలాలను గ్రామ దేవతలుగా పూజిస్తారట.అవి ఉండే చెట్టును పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయని ఆ గ్రామంలోని ప్రజలు ఎప్పటి నుండో నమ్ముతున్నారు.

ఇంత టెక్నాలిజీ పెరిగిన ఇప్పటికి ఆ గ్రామంలోని ప్రజలు మాత్రం ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.చిత్తూరు జిల్లా రామచంద్ర పురం మండలం నడవలూరు గ్రామంలోని ప్రజలు ఒక ఆశ్చర్యాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు.

ఆ గ్రామంలో గబ్బిలాలను దేవతలుగా కొలుస్తారట.ఆ గబ్బిలాలు వారిని కష్టాల నుండి బయట పడేస్తాయని నమ్ముతారు.

ఈ గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చే దగ్గర 11 చింత చెట్లు ఉంటాయి.

11 చింత చెట్ల మీద గబ్బిలాలు నివసిస్తున్నాయి.

ఆ గ్రామంలోకి కొత్తగా ఎవరైనా వెళ్తే వాటిని చూసి భయపడడం ఖాయం.కానీ ఈ గ్రామంలోని ప్రజలు మాత్రం వీటిని గ్రామ దేవతలుగా భావిస్తారు.

Telugu Andhra Pradesh, Bats, Bats Goddess, Chittoor, Batsworshipped, Offerspraye

వీరు ఇలా భావించడం వెనుక పెద్ద కథ ఉంది.కొంతమంది పిల్లలు బరువు తక్కువుగా, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో పుడుతుంటారు.ఏదైనా దోషం వల్ల ఇలా జరుగుతుందని కొంత మంది విశ్వాసం.

ఈ గ్రామంలోని ప్రజలు అలా అనారోగ్యాలతో జన్మించిన పిల్లలను ఆ చింత చెట్టు ఉన్న దగ్గరకు తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారట.

అలా ఆ పూజలు చేస్తే ఆ పిల్లలకు ఉన్న దోషం పోతుందని వీరి నమ్మకం.ఆ గబ్బిలాలకు ఎవరైనా హాని చెయ్యాలని చుస్తే వారిని చెట్టుకు కట్టేసి మరి బుద్ధి చెప్తారట.

ఈ ఆచారం ఈ ఒక్క గ్రామంలోనే కాదు.కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ప్రజలు పాటిస్తారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube