ఈ కుక్క మాంసం ముక్క‌ను ఎలా దొంగిలిస్తుందో చూస్తే న‌వ్వాపుకోలేరు..

ఈ సృష్టిలో బ్ర‌త‌కాలంటే తిండి తినాల్సిందే.ఎవ‌రికైనా ఈ రూల్ తప్ప‌నిస‌రి.

 Can't Wait To See How This Dog Steals A Piece Of Meat , Dog, Viral Video-TeluguStop.com

కొంద‌రికి ఇది ఈజీ కావ‌చ్చు.కానీ మ‌రి కొంద‌రికి మాత్రం తిండి దొర‌క‌డ‌మే చాలా క‌ష్టంగా మారుతోంది.

ఇక జంతువుల విష‌యానికి వ‌స్తే మాత్రం వాటికి ఆహారాన్ని సంపాదించుకోవ‌డం నిత్యం ఒక యుద్ధంలాగే ఉంటుంది.జంతువులు ఆహారాన్ని సంపాదించుకోవ‌డం కోసం అవి ప‌డే పాట్లు అన్నీ ఇన్ని కావు.

అందుకేనేమో కూటి కోసం కోటి తిప్ప‌లు అనే సామెత పుట్టుకొచ్చింది.ఇక‌పోతే ఇప్పుడు ఓ కుక్క ఆహారం కోసం చేసిన ప‌ని తెలిస్తే అంద‌రూ షాక్ అవ్వాల్సిందే.

మామూలుగానే జంతువుల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైల‌ర్ అవుతుంటాయి.అలాంటిది ఇక కుక్క విన్యాసానికి సంబంధించింది వైర‌ల్ కాకుండా ఉంటుందా.అందుకే ఇది ఇప్పుడు విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా న‌వ్వుకోవాల్సిందే అన్న‌ట్టు ఉంది.

ఈ వీడియో కొంద‌రికి ఫ‌న్నీగా అనిపిస్తే మ‌రి కొంద‌రికి మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.నిజానికి కుక్క‌లు ఆహారం కోసం ఇలాంటి ప‌ని కూడా చేస్తాయా అనిపిస్తుందేమో.

ఎందుకంటే ఈ కుక్క మాంసం ముక్క కోసం ఏకంగా దొంగ అవ‌తారం ఎత్తుకుంది.

ఇందులో చూస్తే గ‌న‌క ఓ కుక్క‌ఇంట్లో హాయిగా నిద్రపోతున్న‌ట్టు క‌నిపిస్తుంది.

ఇంత‌లోనే అక్క‌డ‌కు మ‌రో కుక్క రావ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.ఇక నిద్ర పోతున్న కుక్క ప‌క్క‌న ఒక మటన్ ముక్క ఉండ‌టం మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఇక ఆ కుక్క ఎలాగైనా దాన్ని కొట్టేయాల‌ని గుట్టుచప్పుడు కాకుండా ఏదో ప‌డుకున్న‌ట్టు యాక్ట్ చేస్తూ మెల్లిగా కాలితో దాన్ని లాక్కుంటుంది.ఏ మాత్రం అనుమానం రాకుండా న‌టిస్తూ సౌండ్ రాకుండా సింపుల్ గా కుక్క దాన్ని దొంగతనం చేయ‌డం మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తుంది.

ఇంకేముంది ఇలా కొట్టేసిన మ‌ట‌న్ ముక్క‌ను దాని నోట్లో పెట్టుకుని ప‌క్క‌కు పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube