టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించింది.
అంతేకాకుండా అక్కినేని ఇంటి కోడలు అయ్యాక మరింత క్రేజ్ సంపాదించుకుంది.కానీ గత కొన్ని రోజుల నుండి తన భర్త అక్కినేని నాగ చైతన్యతో విడిపోవడంతో ఘోరమైన విమర్శలు ఎదుర్కొంటోంది.
ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది సమంత.ఇక ఈ సినిమాతోనే నాగచైతన్యతో కూడా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.ఓవైపు నాగచైతన్యతో రిలేషన్ లో ఉంటూ మరోవైపు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఆ తర్వాత తమ ప్రేమను పెద్దల సమక్షంలో పెళ్లిగా మార్చుకున్నారు.
పెళ్లి తర్వాత అక్కినేని సమంతగా, బిజినెస్ ఉమెన్ గా మంచి స్టేటస్ సంపాదించుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచిన ఈ జంట గత కొన్ని రోజుల నుండి విడిపోతున్నట్లు బాగా టాక్ వినిపించింది.
దీంతో ఇదంతా పుకారు అనుకోగా ఇటీవలే ఈ విషయం గురించి సమంత, నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు.తాము విడిపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇక దీంతో వీరిద్దరి విడిపోవడంతో సమంతనే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంది.
నాగచైతన్య కంటే సమంతకే ఎక్కువ క్రేజ్ ఉండటంతో అందరూ సమంత పైనే విరుచుకుపడ్డారు.
అంతేకాకుండా తన పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో తనకు సంబంధం ఉందని పైగా అతడితో దిగిన ఫోటోలు షేర్ చేసి మళ్ళీ డిలీట్ చేయడంతో అందరికీ అనుమానాలు ఎదురయ్యాయి.కానీ వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని మంచి స్నేహం మాత్రమే ఉందని తెలిసింది.
అయినా కూడా ప్రీతమ్ పై చాలామంది విమర్శలు చేసారు.ఇదిలా ఉంటే గతంలో శ్రీ రెడ్డి ఈ విషయం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయగా తాజాగా శ్రీ రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టింది.
సమంతకు, ప్రీతమ్ కు లింకు పెట్టాల్సిన అవసరం లేదంటూ.తనకు తెలిసినంత వరకు నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఇది కాదని తెలిపింది.
సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు వివాహ వేడుకలకు ఆహ్వానం పలికే రిసెప్షన్ జాబ్ చేసేది అంటూ చిన్న స్థాయి నుంచి వచ్చిన సమంతకు డబ్బు వ్యామోహంతో బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుందని తెలిపింది.నాగచైతన్య ఇచ్చిన ఫ్రీడమ్ ను నాశనం చేస్తుంది అంటూ.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా ఉన్న కరీనా కపూర్, ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి వంటి వాళ్లే పెళ్లి జీవితానికి గౌరవం ఇచ్చి సినిమాలు వదులుకున్నారని తెలిపింది.
అలాంటిది సమంతకు ఏమైందని ఆమె చూడటానికి మంచి కలర్ కాదని అంత హైట్ కాదని చూడటానికి క్యూట్ గా తప్ప ఏమి లేదని కేవలం మరింత ఎత్తు కోసం భూమి మీద కాళ్లు లేకుండా ఎగరాలనుకుంది అంటూ విమర్శలు చేసింది.ఇక తనకు సైడ్ యవ్వారాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది.ఇక ప్రీతమ్ కు తనకు సంబంధం లేదని అతడు గే అని అందుకే సమంతతో క్లోజ్ గా ఉంటాడని తెలిపింది.
కానీ వారి మధ్య మరో సంబంధం లేదని తెలిపింది.