కంటైనర్ తో కట్టేద్దాం..! తక్కువ ఖర్చుతో భవన నిర్మాణం చూసేద్దామా..

భవన నిర్మాణం అంటే మాటలు కాదు… పురాణాలు తీసింది మొదలు స్లాబ్ వేసే దాకా ఎన్నో వస్తువులు, ఎన్నో పనులు నెలలు, సంవత్సరాల తరబడి ఎదురు చూపులు.ఇవేవీ లేకుండా నిర్మాణాలు సాధ్యం అవుతున్నాయి.

 Lets Built It With A Container Lets Look At Low Cost Building Construction, Bui-TeluguStop.com

షిప్పింగ్ కంటైనర్ లతో కళ్ళు చెదిరే భవనాలు పురుడు పోసుకుంటున్నాయి.క్షణాల్లో ఆసుపత్రిగా.

బడిగా.ఇల్లుగా మారిపోతున్నాయి.

ఇటీవలే అత్యాధునిక మాడ్యులర్ క్లినిక్ లను ఏర్పాటు చేసింది ఢిల్లీ సర్కార్.అవి మామూలు నిర్మాణాలే అయితే ఇక్కడ చర్చకు వచ్చేవి కాదు.

సిట్టింగ్ కంటైనర్లు తో నిర్మించినవి కాబట్టే.దేశమంతా వాటి గురించి మాట్లాడుకుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేక ఎన్నో దేశాలు ఇబ్బంది పడ్డాయి.

అయితే దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు మాత్రం ఒకే ఒక్క ఐడియాతో ఈ సమస్య నుంచి గట్టెక్కాయి.

షిప్పింగ్ కంటైనర్లను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు ఆశ్రయించాయి.కారణం.ఇనుప కంటైనర్లు తో నిర్మాణాలు త్వరగా పూర్తి కావడమే.ఎప్పుడు పెడితే.

ఎక్కడ పడితే.అక్కడికి మార్చుకునేందుకు వీలున్న కంటైనర్లను పాఠశాలలు గాను మార్చుతున్నారు.

మహారాష్ట్రలో సమర్థ భారత్ వ్యాసపిత్ అనే ఎన్జీవో థానే మున్సిపల్ కార్పొరేషన్ సాయంతో నగరంలోని ఓ ఫ్లైఓవర్ కింద ‘సిగ్నల్స్ శాల’ పేరుతో కంటైనర్ లతో ఓ బడిని రూపొందించారు.

Telugu Delhi, Cost, Signals Shala-Latest News - Telugu

ఢిల్లీకి చెందిన సఫెడుకేట్ అనే సంస్థ గురుగ్రామ్ లోని బినోలా లో దాదాపు ఎనిమిది కంటైనర్లు తో శిక్షణా కేంద్రాన్ని నిర్మించారు.మురికివాడల్లోని పిల్లలు, బిక్షాటన చేసే వారి పిల్లల కోసం మరో 50 కంటైనర్లతో పాఠశాలలు నిర్మిస్తున్నట్లు అవుట్ ఆఫ్ స్కూల్స్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు అమరీశ్ చంద్ర ప్రకటించారు.కంటి నరుల జీవిత కాలం 12 సంవత్సరాలు.

వాటిని రీసైక్లింగ్ చేయడం కష్టం.కాబట్టి వాటిని కొత్తగా పునరుద్ధరించడమే ఉత్తమ మార్గమని ఘజియాబాద్ కి చెందిన వాస్తుశిల్పి రాహుల్ జైన్ అంటున్నారు.

ఇవి దృఢంగా నాణ్యతగా ఉండడతో భవనాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube