జగన్ టార్గెట్ గా డీఎల్ ! ఏ పార్టీతో డీల్ చేసుకున్నారో ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కు రోజురోజుకు కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు.ఇప్పటి వరకు టిడిపి పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ జగన్ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా, ఆ తరువాత జనసేన స్థాయిలో ఉద్యమాలు చేపట్టి జగన్ ప్రభుత్వ పరిపాలన పై విమర్శలు చేస్తూ వచ్చారు.

 Dl Ravindra Reddy Sensational Comments On Ap Government, Dl Ravindra Reddy, Ys J-TeluguStop.com

ఇప్పుడు మరో కొత్త నేత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు యాక్టివ్ అయ్యారు.వై.

ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కీలక నాయకుడిగా పేరుపొందిన డిఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు చేశారు.చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్న రవీంద్రారెడ్డి  రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ ప్రకటించారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఏపీలో ప్రస్తుతం దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని, వ్యవసాయం సంక్షోభంలో పడింది అని,  రైతులను పట్టించుకునేవారే కరువయ్యారు అంటూ విమర్శించారు.

అంతేకాదు తన సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా, ఎవరూ ముదుకు రాని పరిస్థితి ఏర్పడిందని, సొంత ఖజానా నింపుకునేందుకు పాలకులు పని చేస్తున్నారంటూ రవీంద్ర రెడ్డి విమర్శలు చేశారు.రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించడం లేదని , అసలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని రవీంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత డి.ఎల్.రవీంద్రారెడ్డి యాక్టివ్ గా రాజకీయాలలో ఉండడం లేదు.
 

Telugu Ap, Jagan, Lotus Pond, Maidukuri, Target Jagan, Ys Jagan, Ysrcp-Telugu Po

అంతేకాదు జిల్లా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.అయితే ఇప్పుడు మళ్లీ పొలిటికల్ గా యాక్తీవ్ కావడంతో 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  ఆయన ఈ విధంగా విమర్శలు చేస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.2019 ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరబోతున్నట్లు హడావుడి నడిచింది.అంతేకాదు జగన్ ను కలిసి వైసీపీకి మద్దతు తెలిపారు.ఆ తర్వాతి క్రమంలో ఆయన వైసీపీకి దూరంగానే ఉంటున్నారు.ప్రస్తుతం వైసీపీ పై ఆయన విమర్శలు చేసిన క్రమంలో 2024 ఎన్నికల్లో టిడిపి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా డీఎల్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube