బొమ్మరిల్లు సినిమా కథ ఆ పుస్తకం నుంచి తీసుకున్నారా?

2006లో మంచి ప్రేమ కథ నేపథ్యంతో విడుదలైన సినిమా బొమ్మరిల్లు. ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడు.

 Did Bommarillu Movie Story Taken From That Book Details,  Bommarillu, Tollywood,-TeluguStop.com

ఈ సినిమాతో డైరెక్టర్ భాస్కర్ కు మంచి గుర్తింపు రావడంతో బొమ్మరిల్లు భాస్కర్ గా పేరు సంపాదించుకున్నాడు.దిల్ రాజ్ నిర్వహణలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియా నటీనటులుగా నటించారు.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమా కథ, పాటలు, పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాకు కథను డైరెక్టర్ ఓ పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకు తొలిసారిగా తన దర్శకత్వంను పరిచయం చేశాడు భాస్కర్.

కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.

ఇక బొమ్మరిల్లు సినిమాతో ఉత్తమ నూతన దర్శకుడు గా అవార్డు కూడా అందుకున్నాడు.

ఇక ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న తర్వాత అప్పట్లో ఈ సినిమా గురించి ఒక కాంట్రవర్సీ బాగా నడిచింది.ఈ సినిమాకు కథను ఒక కథ పుస్తకం నుండి తీసుకున్నట్లు తెలిసింది.

అది కూడా ‘ఆమెలో ఏముంది’ అనే బుక్ నుంచి డైరెక్టర్ భాస్కర్ ఈ సినిమా కథను రూపొందించినట్లు తెలిసింది.

Telugu Aamelo Emundi, Akhil, Bommarillu, Genelia Dsouza, Pooja Hegde, Siddharth,

దీంతో ఈ కథను రాసిన రైటర్ కూడా ఈ సినిమాపై కేసు వేసినట్లు గతంలో బాగా వార్తలు వినిపించాయి.ఆ తర్వాత మళ్లీ ఈ విషయం గురించి ఎవరు మాట్లాడుకోకపోగా తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బొమ్మరిల్లు కథ గురించి హాట్ టాపిక్ గా మారింది.ఇక బొమ్మరిల్లు సినిమా తర్వాత పరుగు సినిమాకు దర్శకత్వం వహించి ఈ సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఆ తర్వాత వరుసగా ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందగా తాజాగా ఈ సినిమా విడుదలైంది.కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోగా కొంతవరకు మెప్పించిందని తెలుస్తుంది.

ఇందులో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటీనటులుగా నటించారు.

Telugu Aamelo Emundi, Akhil, Bommarillu, Genelia Dsouza, Pooja Hegde, Siddharth,

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కథ కాస్త ఆకట్టుకునే విధంగా లేదని ఎలా ప్రారంభం అయ్యిందో ఎలా ముగిసిందో అర్థం కాలేదని చాలామంది కామెంట్లలో తెలిపారు.దీంతో తాజాగా ఈ సినిమా గురించి కూడా పలురకాల ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.కొంతవరకు ఈ సినిమా కథ బొమ్మరిల్లు సినిమా కు సింక్ అయ్యేలా ఉందని టాక్ కూడా వచ్చింది.

నిజానికి ఈ సినిమా చాలా కన్ఫ్యూజన్ గా ఉందని పాత పద్ధతిలోనే ఈ సినిమాను రూపొందించాడని తెలిసింది.ఈ సినిమాలో కొత్తదనం కనిపించలేదు అంటూ తీసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ ఉన్నట్లు అనిపించాయి అని నెటిజన్లు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube