బాలయ్య యాపారం మాములుగా లేదుగా.. అల్టిమేట్ ప్లాన్స్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలిచిన బాలయ్య ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండగా మరోవైపు బిజినెస్ వైపు కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.

 Balakrishna Vote For Manchu Family And Business With Mega Family, Balakrishna, T-TeluguStop.com

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలయ్య ఇప్పటికీ మరింత అభిమానాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య యాపారం మామూలుగా లేదుగా అంటూ ఫ్యాన్స్ మరింత రచ్చ చేస్తున్నారు.

తాజాగా బాలయ్య మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఈయన త్వరలోనే ఓటీటీ వేదికగా ఓ రియాలిటీ షోలో చేయనున్నాడు.అందులో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలను అన్ స్టాపబుల్ అనే షో ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నాడు.ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ మనిషి ప్రజెంటేషన్ అన్ స్టాపబుల్ అంటూ నవ్వడం, నవ్వించడం నటన కాదు పాత్రలోకి ప్రవేశించడమని ఇది ఎంతో ఒత్తిడితో ఉంటుందని తెలిపాడు.

ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం అనేది ఉంటుందని.వాటిని ఎదురుకుని లక్ష్యాన్ని చేరుకోవడమే అన్ స్టాపబుల్ అని అన్నాడు.

Telugu Allu Aravind, Balakrishna, Balakrishnaaha, Tollywood-Movie

ఇది తనకు నచ్చిందని అందుకే ఈ షోను ఒప్పుకున్నానని.ఇందులో హాజరయ్యే నటీ నటులతో కలిసి మాట్లాడతానని తెలిపాడు.అంతేకాకుండా వాళ్లను మాటలతో ట్విస్టు చేస్తాను అంటూ.ఆహా వేదికలో అన్ స్టాపబుల్ షోలో కలుద్దాం అంటూ ముగింపు చెప్పాడు.ప్రస్తుతం బాలయ్య మాట్లాడిన మాటలు ఆయన అభిమానులనే కాకుండా నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకున్నాయి.ఇక మొత్తానికి ఈ షో వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.

ఇదంతా చూస్తే బాలయ్య యాపారం మామూలుగా లేదు కదా అంటూ ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube