భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కోతిని మీరు ఎప్పుడన్నా చూసారా..?!

దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా.జై హో దుర్గాభవాని అని ప్రతి ఒక్కరి ఇల్లు ఈరోజు అమ్మవారి భక్తి పాటలతో కళకళ లాడిపోతూ ఉంటుంది కదా.

 Have You Seen The Monkley Going Into Devotional Mode, Dasara Festival, Latest Ne-TeluguStop.com

అయితే ఈ దసరా పండగ రోజు ఈ సంవత్సరం అమ్మవారి గుళ్ళల్లో నవరాత్రుల ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి.ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.

సాధారణంగా ఏ దేవుడి గుడికి వెళ్లిన మనుషులు భక్తి భావంతో ఉంటారు కదా.కానీ ఇక్కడ ఒక కోతి మాత్రం తన కోతి వేషాలు పక్కన పెట్టి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.దేవుడి పూజలో నిమగ్నం అయిపొయి కనిపించడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో చుసిన నెటిజన్లు ఈ కోతి భక్తికి ఫిదా అయిపోతున్నారు.

కోతిని మనం ఆంజనేయస్వామికి ప్రతి రూపంగా కొలుచుకుంటూ ఉంటాము.హనుమంతుడు రామ భక్తుడు అనే విషయం మన అందరికి తెలిసిందే కదా.ఆ రాముడి మీద భక్తితోనే సాక్షాత్తు కోతి రూపంలో హనునంతుడే వచ్చాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.అసలు ఈ వానరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ భజన చేస్తున్న సాధువుల దగ్గరకు వచ్చింది.

అక్కడ ఉన్న ఒక సాధువు ఒడిలో కూర్చుని వారు చేసే భజనకు లయబద్దంగా ఆ వానరం కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారినందరినీ ఆశ్యర్య పరిచింది.

Telugu Dasara Festival, Latest, Monkey-Latest News - Telugu

ఆ సాధువులతో పాటు వానరం కూడా భక్తి కీర్తనల్లో మునిగియంది.ఈ కోతి సాక్షాత్తు హనుమంతుడి రూపమే అనే అక్కడి ఉన్నవారందరూ తెగ మురిసిపోతున్నారు.ఈ వీడియోను పంకజ్ పరాశర్ అనే ఒక యూజర్ తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోను ఇప్పటిదాకా లక్షలాది మందికి చూడగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.ఇలాంటి కోతిని మునుపెన్నడూ చూడలేదని ఒకరంటే., దసరా పండగ నాడు ఒక గొప్ప వీడియో చూశామని జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ మరొకరు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube