వీడు మామూలు దొంగ కాదు.. ఏకంగా చ‌ర్చిలో బంగారాన్ని..

అందరూ చర్చికి వెళ్లి ఏం చేస్తారు.ప్రార్థ‌న‌లు చేయ‌డానికి, ఆ ప్ర‌భువు ఆశీష్షులు పొంద‌డానికి వెళ్తారు.

 See How This Thief Is Stealing Gold In The Church, Church, Thief , Thief, Theft-TeluguStop.com

కానీ ఓ వ్య‌క్తి మాత్రం ప్ర‌భువుకే టోపీ పెట్ట‌డానికి వెళ్లాడు.పండ‌గ పూట అంద‌రూ ప్ర‌భువు ఆశీర్వ‌చ‌నం తీసుకొని, హ్యాపీగా ఉంద‌మ‌నుకున్న స‌మ‌యంలో ఆ వ్య‌క్తి చేసిన ప‌నికి అంద‌రూ ప‌రేషాన్ అయ్యారు.

ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఏం చేశాడు అంటారా ? అదే ఇప్పుడు చెప్ప‌బోతున్నాం.త‌మిళ‌నాడు, కేర‌ళ మ‌ధ్య ఉన్న ఓ చ‌ర్చిలోకి వ్య‌క్తి చొర‌బ‌డి.

అక్క‌డ ఉన్న బంగారాన్ని దోచుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు.స‌క్సెస్ ఫుల్‌గా దోచుకెళ్లాడు కూడా.

ముందుగా చ‌ర్చిలోకి చొర‌బ‌డి ఏం తెలియ‌న‌ట్టు మాములుగా న‌డుచుకుంటూ వెళ్లాడు.

మొకానికి క‌ర్చీఫ్ క‌ట్టుకొని ఉండ‌టం వ‌ల్ల అత‌డి ఫేస్ స‌రిగా క‌నిపించ‌లేదు.

తీరిగ్గా న‌డుచుకుంటూ వెళ్లి అక్క‌డ గ్లాసు గ‌దిలో ఉన్న బంగారం ద‌గ్గ‌రికి వెళ్లాడు.అటూ ఇటూ చూసి ఆ బంగారాన్ని దోచుకెళ్లాల‌ని చూశాడు.

కానీ ఎలా దానిని తీసుకెళ్లాలో తెలియ‌లేదు.ప‌క్క‌నే ఫ్లోర్ క్లీన్ చేసే దానిని తీసుకున్నాడు.

దానితో అక్క‌డ ఉన్న గ్లాస్ గ‌దిని ప‌గ‌ల‌గొట్టాడు.అనంత‌రం ఎందుకో ప‌క్క‌కి వెళ్లి వ‌చ్చాడు.

అనంత‌రం గాజు ముక్క‌లు గుచ్చుకోకుండా జాగ్ర‌త్త‌గా న‌డిచాడు.అనంత‌రం ఆ గాజు గ‌దిలో నుంచి మెళ్లగా బంగారాన్ని తీసుకున్నాడు.

Telugu Cc Tv Footage, Church, Church Thief, Gold, Kerala, Robbery Church, Tamil

ఇక ఎవ‌రూ చూడ‌క ముందు వాటిని త‌న వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో ఆ బంగారాన్ని వేసుకొని మెళ్ల‌గా అక్క‌డి నుంచి ఉడాయించాడు.ఈ తతంగం అంతా అక్క‌డున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.బంగారం చోరీకి గురి అయ్యింద‌న్న స‌మాచారం తెలుసుకున్న ఆ చ‌ర్చి నిర్వాహ‌కులు సీసీ కెమెరాలు ప‌రిశీలించ‌గా ఈ ఘ‌నుడు చేసిన కార్యం అంతా బ‌య‌ట‌ప‌డింది.దీంతో అత‌డిని ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube