వైర‌ల్‌.. మనిషిలాగే పిల్లలను ప‌ల‌క‌రిస్తున్న చిలుక..

అన్ని రకాల వీడియోలకు సోషల్ మీడియా ఓ వేదిక.ఇందులో ఎన్నో రకాల వీడియోలు మనకు కనిపిస్తాయి.

 Viral A Parrot That Scares Children Like A Human,viral Video, Parrot , Turkey, P-TeluguStop.com

కొందరు సహజంగా తీసిన వీడియోలు కూడా ఎన్నో అద్భుతాలను సృష్టించాయి.కొన్ని కామెడీలను పంచుతాయి.

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవడం కామన్.అవి చేసే పనులు, చేష్టలు ఎంతో ఫన్నీగా అనిపిస్తాయి.

మరి కొన్ని ఆలోజింపజేసేలా ఉంటాయి.ఇలాంటి వాటిని చూసినప్పుడు మనమే వాటిని ప్రత్యక్షంగా, దగ్గర నుంచి చూసిన భావన కలుగుతుంది.

అప్పుడే పుట్టిన పిల్లలను మనం చూడగానే.చిన్నితల్లి, చిట్టి తండ్రి, బంగారు కొండా ఇంకా తదితర పేర్లు పలుకుతూ ముద్దు పేరుతో పిలుస్తారు.వారిని ఎత్తుకుని వారి కదలికలను కంట్రోల్ చేస్తూ ఆనందిస్తుంటారు.అచ్చం ఇలాగే టర్కీలోని బుర్సా ప్రాంతంలో ఓ చిలుక మనిషిలాగే తన పిల్లలను ముద్దుముద్దుగా పలకరిస్తున్నది.

రామచిలుక జాతికి చెందిన కాకాటిల్స్ అనే ఈ పక్షికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీన్ని చూస్తున్న నెటిజన్లు అది తన పిల్లలను పలకరిస్తున్న తీరును చూసి ఫిదా అవుతున్నారు.

అప్పుడే పుట్టిన తన పిల్లలు ఒక బాక్స్‌లో ఉండగా బయట నుంచి వాటిని కిచ్ కిచ్ అంటూ పలకరిస్తుంది.దానికి ఆ పక్షి పిల్లలు స్పందిస్తున్నాయి.

దీనికి సంబంధించి ఓ వ్యక్తి వీడియో తీసి దానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.దీనిపై నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఈ పక్షి.తన పిల్లలపై చూపిస్తున్న ప్రేమను బట్టే తెలుస్తున్నది సృష్టిలో అమ్మ ప్రేమ గొప్పతనం ఏమిటో.అది పిల్లలకు ఎలా చేరువువుతుందో.

మరి ఆలస్యం ఎందుకు? మీరు సైతం ఆ వీడియోను చూసెయ్యండి.ఈ వీడియో మీకు సైతం నచ్చుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube