ఫ్రెండ్‌షిప్ పేరుతో ప‌రిచ‌యమైంది.. ఆ త‌ర్వాత న్యూడ్ వీడియోల‌తో..

అమ్మాయిలను అబ్బయిలు వేధించడం కామన్.కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉంది.

 Introduced Under The Name Of Friendship With Nude Videos After That, Crime News,-TeluguStop.com

యువతి.యువకుడిని వేధించడం స్టార్ట్ చేసింది.విసుగుచెందిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు.దీంతో ఈ విషయం బయటకు వచ్చింది.ఈ ఘటన బంజారాహిల్స్ పరిధిలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.

రోడ్డు నెంబర్ 12‌, భోలానగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి (32) ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అతడికి మూడు నెలల క్రితం సాక్షి‌వర్మారెడ్డి అనే పేరుతో ఒక యువతి పరిచయమైంది.

వీరిద్దరూ వాట్సాప్ చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు.ఇలా కొద్ది రోజులు గడిచాక.

మొదట తన న్యూడ్ వీడియోస్‌ను ఆమె యువకుడికి చూపించింది.ఆ తర్వాత యువకుడిని సైతం న్యూడ్ వీడియో చూపించాలని చెప్పడంతో అతడు తన న్యూడ్ వీడియోలను ఆ యువతికి పంపించాడు.

అప్పటి వరకు కామన్‌గా బిహేవ్ చేసిన సదురు యువతి.సదురు యువకుడు పంపింపిన న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకుని తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.

వీడియోను ఫేస్‌బుక్‌లో పెడతానంటూ యువకుడిని బెదిరించింది.ఆత్మహత్య చేసుకుంటాను అంటూ అతడిని భయబ్రాంతులకు గురి చేసింది.

ఇది ఇలాగే కొనసాగుతుండటంతో సదురు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.యువతి వేధిస్తున్నదని వారికి ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Telugu Banzarahills, Bhola Nagar, Black Mail, Whatsapp-Latest News - Telugu

ఎవరితో పడితే వారితో, కొత్త వారితో మాట్లాడే ముందు, చాటింగ్ చేసే ముందు ఆలోచించాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ఇలా మోసాలకు పాల్పడే యువతుల వలలో పడొద్దని సూచిస్తున్నారు.సోషల్ మీడియాలో స్నేహం చేసేవారితో, మాయమాటలు చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా, బ్లాక్ మెయిల్ చేసినా వెంటనే పోలీసులను సంప్రదించాలని బాధితులుగా మారొద్దని చెబుతున్నారు పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube