ఆనంద్ దేవరకొండ 'బేబీ'..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ డైరక్షన్ లో ఒక సినిమా వస్తుంది.దసరా సందర్భంగా గురువారం ఈ సినిమాకు ముహుర్తం పెట్టారు.

 Anand Devarakonda New Movie Baby, Anand Devarakonda , New Movie , Baby , Tollywo-TeluguStop.com

ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో సుకుమార్, మారుతి, అల్లు అరవింద్ పాల్గొన్నారు.

ఇక ఈ సినిమాకు బేబీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.మొదటి సినిమా దొరసాని తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ తో హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం పుష్పక విమానం సినిమా చేస్తున్నాడు.

పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాకు సన్నద్ధం అవుతున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండతో పాటుగా విరాజ్ అశ్విన్ కూడా నటిస్తున్నారు.

కలర్ ఫోటో సినిమాకు కథను అందించి నిర్మించిన సాయి రాజేష్ ఈ బేబీ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.అన్న యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటుండగా ఆనంద్ దేవరకొండ మాత్రం క్లాస్ హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అవ్వాలని చూస్తున్నాడు.

 రాబోయే ఈ సినిమాలతో ఆనంద్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube