విద్యుత్ కొరత విషయంలో అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విద్యుత్ కొరత సమస్యను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.మహమ్మారి కరోనా కారణంగా.

 Cm Jagan Gives Key Directions To Officials Regarding Power Shortage Details,  An-TeluguStop.com

చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేయటంతోపాటు కరుణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల.అంతర్జాతీయంగా బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు మొన్నటివరకు క్లోజ్ అయిపోయాయి.

అయితే ఇటీవల కరోనా పరిస్థితి అదుపు లోకి రావడంతో.బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీలు ఓపెన్ కాగా అంతకుముందు వచ్చిన నష్టాలను భర్తీ చేయడానికి.

బొగ్గు ధరలను అమాంతం పెంచేశాయి.దీంతో విద్యుత్ కొరత తీవ్రంగా ఏర్పడింది.

మన దేశంలో కూడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో చాలా రాష్ట్రాలు.విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే కేంద్రం.విద్యుత్ కొరత విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

ఈ విషయంలో ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది.కాగా తాజాగా రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా… అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం జగన్.

ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ క్రమంలో కృష్ణపట్నం విటిపిఎస్ లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Telugu Andhra Pradesh, Ap Cm Jagan, Central, Singareni, Thermal, Ys Jagan-Politi

అంతమాత్రమే కాకుండా దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా తీసుకురావటానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని స్పష్టం చేశారు.మరోపక్క ఇప్పటికే కేంద్ర విద్యుత్ శాఖ. రాష్ట్రాలకు మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు కరెంటు సాయం అందించాలని బొగ్గు నిల్వలు ఉన్న సంస్థలు కూడా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు సాయం చేయాలని.లేఖలు రాయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube