'మా' వివాదం.. మెగా వర్గం ఆ నటులను బ్లాక్ లిస్ట్ లో చేర్చిందా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు మెగా కుటుంబానికి చెందిన కొంతమంది హీరోలకు ఆగ్రహం తెప్పించాయి.ఎన్నికల వల్ల పైకి చెప్పకపోయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో చీలిక ఏర్పడిందని చాలామంది భావిస్తున్నారు.

 Movie Chances For Mohan Babu Supporters In The Coming Days Will Be Difficult,lat-TeluguStop.com

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల ఏ నటులు ఏ కాంపౌండ్ అనే విషయం గురించి సైతం క్లారిటీ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇకపై మెగాహీరోల సినిమాలలో కొంతమంది నటులకు అవకాశాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది,

Telugu Days, Mohan Babu, Prakash Raj, Difficult-Movie

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకుముందు తాను కృష్ణుని పాత్రను పోషిస్తానని సీనియర్ నరేష్ చెప్పుకొచ్చారు.అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చెందిన సభ్యులు మాత్రం సీనియర్ నరేష్ కృష్ణుడు కాదని అతను శకుని అని కామెంట్లు చేశారు.గత కొన్నిరోజులుగా ప్రకాష్ రాజ్, నాగబాబు ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటూ ఉండటం ఒకరి కౌంటర్లకు మరొకరు కౌంటర్లు ఇవ్వడం చూశాం.

తాజాగా నరేష్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల గురించి ముండమోపి అని కామెంట్లు చేసిన నేపథ్యంలో ఇకపై సీనియర్ నరేష్ కు మెగా హీరోల సినిమాలలో అవకాశాలు దక్కకపోవచ్చని తెలుస్తోంది.మంచు విష్ణు ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులకు సైతం మెగా కాంపౌండ్ సినిమాలలో అవకాశాలు రావడం కష్టమేనని సమాచారం.

అయితే అదే సమయంలో మోహన్ బాబు వర్గం ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Telugu Days, Mohan Babu, Prakash Raj, Difficult-Movie

మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కలిసి ఒకే సినిమాలో నటించడం కూడా కష్టమేనని సమాచారం.పైకి చెప్పకపోయినా టాలీవుడ్ లో విభజన రేఖ వచ్చేసిందని తెలుస్తోంది.మోహన్ బాబు కు మద్దతుగా నిలిచే హీరోలు సైతం ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు అవకాశాలు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.

 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల రచ్చ ఎప్పటికి ఆగుతుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube