అక్కడ నీటిపై తేలియాడే నగరాలను నిర్మించబోతున్నారా..?!

ఆకాశంలో కట్టడాలు, నీటిపై ఇల్లులు కడుతున్నారు అంటే అందరు ఆశ్చర్యపోతారు.ఇవన్నీ ఊహల్లోనే జరుగుతాయి నిజంగా జరగవు అని కొట్టిపారేస్తారు.

 Are European Countries Building Floating Cities On Water, Water Details, Floatin-TeluguStop.com

కానీ ఆ ఊహలు చాలా బాగుంటాయి.కింది నుంచి ఆకాశం వైపు చూస్తుంటే మనకు నచ్చిన ఇల్లు రంగురంగులుగా కనబడితే, నీటి మధ్యలో నీటిపై ఇల్లు మనకి నచ్చినట్టుగా ఉంటే భలేగుంటుంది కదా.ఊహించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది.అయితే ఈ ఊహను యూరప్ దేశాల వారు నిజం చేసుకోబోతున్నారు.

ఇళ్లను కాదు ఏకంగా నీటిపై నగరాలనే నిర్మించనున్నారు.భూమి మీద జనాభా పెరుగుతుండడం, వాతావరణ సమస్య, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇలా నీటిమీద నగరాలను యూరప్ దేశాలు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం.

మూడు అంతస్థుల భవనం అందరిని ఆకట్టుకుంటుంది.ఈ రోజుల్లో మూడు అంతస్థుల భవనం అంటే పెద్దదేమీ కాదు.అయితే ఆ భవనం అక్కడ నీటిలో తేలియాడే మూడు అంతస్థుల భవనం.ఇదే అక్కడి ప్రత్యేకత.

ఇటువంటి అద్భతుమైన కట్టడానికి మూలం ‘టాన్ వాన్ నెమెన్’ అనే వ్యక్తి.మాంటెఫ్లోర్ కంపెనీ అధినేత ఆయన.ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఆ భవనం కిటికీ నుంచి చూస్తుంటే నీళ్లలో ఆనందంగా గంతులేస్తున్న యువకులు కనిపిస్తుంటారు.

నీటిపై తేలియాడే 100 ఇళ్లను టాన్ వాన్ నెమెన్ విజయవంతంగా నిర్మించారు.ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇవి కట్టడానికే ఎంత ఇబ్బంది పడ్డారో చెబుతుంటారు.

అయితే అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు గొప్ప వినోదానికి కేంద్రంగా మారాయి.

Telugu Build, European, Houses, Nehterlands, Latest-Latest News - Telugu

అయితే ఇప్పుడు నెదర్లాండ్స్ కూడా తేలియాడే ఇళ్ల నిర్మాణాల కోసం ప్లాన్ చేస్తున్నారు.పరీక్షలు కూడా మొదలుపెట్టేసింది.నెదర్లాండ్ అంటే నీటిమీద నిర్మించే కట్టడాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది.

అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకొని ముందడుగులు వేస్తుంది.యూరప్‌ లోని అతిచిన్న దేశమైన నెదర్లాండ్స్‌ కు సముద్ర మట్టాలు పెరగే ప్రమాదంలో ఉంది.

అయితే ఇప్పుడు ఈ నిర్మాణాల ప్రయోగానికి ఆసక్తి చూపిస్తుంది.అయితే ఇప్పుడు ఇటువంటి కొత్త నిర్మాణాలు, కొత్త ఆలోచనలు వస్తున్నాయని ఆనందపడాలో, నీటిపై ఇలా ఇళ్ల నిర్మాణాలు చేయడంతో వచ్చే సమస్యలతో బాధపడాలో తెలియకుండా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube