ఆ ఫేమ‌స్ కార్ల కంపెనీ నుంచి 30వేల మంది ఉద్యోగులు ఔట్‌

కార్ల కంపెనీలో దానికి ఉన్న స్థానం వేరే.ఆ కార్ల‌ కంపెనీ ఎప్ప‌టిక‌ప్పుడు క‌స్ట‌మ‌ర్ల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లు స‌రికొత్త డిజైన్ల‌తో కార్ల‌ను త‌యారు చేస్తూ దూసుకుపోతోంది.

 30,000 Employees Are Out Of That Famous Car Company.., 30,000 Employees, Vox Vag-TeluguStop.com

దాని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం కూడా అవ‌స‌రం లేదు.అదేనండి వోక్స్ వాగన్.

ఆ కంపెనీ నార్మ‌ల్ కార్ల ద‌గ్గ‌రి నుంచి లగ్జరీ కార్ల దాకా అన్నింటినీ త‌యారు చేస్తూ దూసుకుపోతోంది.చాలా కొత్త వెరైటీల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు దూసుకుపోతోంది.

ఇంకా చెప్పాలంటే కార్ల ప్రపంచంలో పెద్ద కంపెనీల‌తో దూసుకుపోతోంది.టెస్లా కార్ల కంపెనీతో సైతం నిత్యం పోటీ ప‌డుతూనే ఉంది.

ఇంత‌టి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న‌ఈ పెద్ద కంపెనీ కూడా క‌రోనా స‌మ‌యంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంది.ఆటోమోబైల్ రంగం మొత్తం ప‌డిపోయిన స‌మ‌యంలో ఈ కార్లు కూడా అమ్ముడు పోకుండా ఏండ‌టంతె కంపెనీ తీవ్ర ఒడిదొడుకులకు గురైంది.

అమ్మకాలు త‌గ్గిపోవ‌డంతో భారీగా న‌ష్టాలు వాటిల్లాయి.దీంతో ఎలాగైనా మ‌ళ్లీ పుంజుకునేందుకు రెండు నెలల కింద‌ట త‌మ కార్ల‌మీద ఏకంగా భారీ డిస్కౌంట‌లును ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

కొన్నింటి మీద అయితే ఏకంగా లక్షన్నర దాకా ఆఫ‌ర్లు ఇచ్చేసింది.

Telugu Employess, Car Company, Corona, Corona Pandamic, Vox Vagan-Latest News -

ఇంకా కూడా క‌రోనా తీవ్ర‌త ఉండ‌టంతో ఎలాగైనా వీటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు రెడీ అయిపోయింది కంపెనీ.విప‌రీతంగా ఖ‌ర్చులు పెరిగి ఆదాయం త‌గ్గిపోవ‌డంతో మిగ‌తా బ్రాండ్ కంపెనీల‌తో పోటీ ప‌డేందుకు సంచ‌ల‌న నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయిపోయింది.ఇందుకోసం ఈ కంపెనీలో ప‌నిచేస్తున్న దాదాపు 30వేల మంది ఉద్యోగస్తుల‌ను తీసేసేందుకు రెడీ అయిపోయింది.

ఇప్ప‌టికే ఈ విష‌యంపై సూపర్ వైజరీబోర్టుకు దీని మీద పూర్తి స్థాయిలో వోక్స్ వాగన్ కంపెనీ సీఈవో హెర్బర్ట్ డైసెస్ ప్ర‌తిపాద‌న కూడా పెట్టార‌ని త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube