శ్రీరామచంద్రతో ప్రేమపై ఓపెన్ అయిన హమీదా.. ఆ ప్రేమ లభించిందంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5లో ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో ఎవరికీ అర్థం కావడం లేదు.ప్రేక్షకుల ఓటింగ్ కు భిన్నంగా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్లు జరుగుతున్నాయనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

 Hameeda Shocking Comments About Bigg Boss Contestant Sriramachandra, Hameeda ,-TeluguStop.com

ఐదో వారం ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన హమీదా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బిగ్ బాస్ హౌస్ లో తాను శ్రీరామచంద్రకు ఎక్కువ టైమ్ కేటాయించానని అందువల్లే టాస్క్ ల విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయానని హమీదా అన్నారు.

తాను, శ్రీరామచంద్ర లవర్స్ అయితే కాదని లవర్స్ కాకపోయినా తమ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందని హమీదా చెప్పుకొచ్చారు.నేను కోరుకునే ప్రేమ నాకు శ్రీరామ్ నుంచి లభించిందని హమీదా వెల్లడించారు.

నన్ను శ్రీరామ్ ఎంతో ప్రేమగా చూసుకునేవారని హమీదా కామెంట్లు చేశారు.తను, శ్రీరామ్ అన్ని విషయాలను షేర్ చేసుకునే వాళ్లమని హమీదా వెల్లడించడం గమనార్హం.

Telugu Biggboss, Hameeda, Sarayu, Shannu, Sriramachandra, Sunny, Umadevi-Movie

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ముందురోజు శ్రీరామచంద్రతోనే ఎక్కువ సమయం ఉన్నానని హమీదా ఎలిమినేట్ కావడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు.బిగ్ బాస్ హౌస్ లో సిరి చిన్నపిల్ల అని సన్నీ మిస్టర్ మజ్ను అని రవి మంచి మనిషి అని శ్వేత వారియర్ అని హమీదా చెప్పుకొచ్చారు.ఉమాదేవి కూడా మంచి మనిషి అని ఆర్జే కాజల్ ఓవర్ థింకర్ అని ఫేక్ స్టార్ అని హమీదా చెప్పుకొచ్చారు.

Telugu Biggboss, Hameeda, Sarayu, Shannu, Sriramachandra, Sunny, Umadevi-Movie

విశ్వ రెబల్ అని నటరాజ్ వంటగదిలో ప్రతి పని ఆయనే చేయాలనుకుంటారని మానస్ మిస్టర్ పర్ఫెక్ట్ అని హమీదా చెప్పుకొచ్చారు.సరయు స్వీట్ అని ప్రియాంక అల్లరి పిల్ల అని ప్రియ ఫిట్టింగ్ మాస్టర్ అని హమీదా తెలిపారు.షణ్ముఖ్ పెదరాయుడు అని జెస్సీ పిల్ల బచ్చా అని శ్రీరామ్ హిట్లర్ అని అనీ మాస్టర్ సేఫ్ ప్లేయర్ అని హమీదా తెలిపారు.

లోబో ఫుటేజ్ మాస్టర్ అని అయితే ఏం చేయాలని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడని హమీదా చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube