బ్లూమ్ బర్గ్స్ సంచలన సర్వే...అమెరికాలో మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఇదీ...

మధ్య తరగతి ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది.వెనక్కి తగ్గలేరు అలాగని ముందుకు వెళ్ళలేరు.

 Bloom Bergs Survey On Middle Class Families, Middle Class People, Bloom Bergs Su-TeluguStop.com

అందుకే పేద వాడిగా అయినా పుట్టాలి, లేదంటే ధనవంతుడిగా అయినా పుట్టాలి అంటూ ప్రతీ మధ్య తరగతి వ్యక్తి అనుకోని క్షణం ఉండదు.అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపధ్యంలో అమెరికాలో మధ్య తరగతి ప్రజల నడ్డి విరుగుతోందని, వివిధ వర్గాల మధ్య ఆర్ధిక పరమైన అంతరాలు పెరుగుతున్నాయని, మరీ ముఖ్యంగా మధ్య తరగతి వారి సంపద అభివృద్ధి నానాటికి పడిపోతోందని అమెరికాలోని ప్రతిష్టాత్మక సర్వే బ్లూమ్స్ బర్గ్ వెల్లడించింది.

అమెరికా వ్యాప్తంగా ఉన్న మధ్య తరగతి వారి సంపదలో దాదాపు 27 శాతం తగ్గుదల కనిపించిందని, ఆర్ధిక సంక్షోభం కారణంగా పెరుగుతున్న ఖర్చులు, కరోనా పరిస్థితులు ఇవన్నీ మధ్య తరగతి వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని వెల్లడించింది.ఇదిలాఉంటే ధనవంతుల సంపద మాత్రం నానాటికి పెరుగుతోందని, అమెరికా యావత్ సంపదలో దాదాపు 28 శాతం సంపద అపర కుభేరుల మధ్య ఉందని, ఈ పరిస్థితుల నేపధ్యంలో మధ్య తరగతి వర్గాల సంపద ఆవిరి అవుతోందని, వారి అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందని నివేదికలో వెల్లడించింది.

అయితేకరోనా సంక్షోభం అన్ని దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపించింది మధ్య అక్కడి మధ్య తరగతి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని, కానీ అమెరికాలో కరోనా సంక్షోభం సమయంలో అక్కడి ప్రజలను సమస్యల నుంచీ బయటపడేసేందుకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించి కోట్లాది రూపాయల నిధులు ఇచ్చినా సరే మధ్య తరగతి ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదని, వారి జీవితాలు ఇప్పటికీ అలానే ఉన్నాయని ప్రస్తుతం కుబేరుల సంపద అమెరికాలో అత్యధికంగా ఉందని, వారి అభివృద్ధి కరోనా సమయంలో కూడా పెరిగింది తప్ప తరగలేదని బ్లూమ్ బర్గ్స్ తన నివేదికలో వెల్లడించింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube