రాష్ట్రపతితో భేటీ అయిన రాహుల్ గాంధీ బృందం..!!

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ లో… ఆందోళనలు నిరసనలు చేపడుతున్న రైతుల పై కేంద్ర మంత్రి కొడుకు తన జీప్ వల మీదకి పంపించడం తెలిసిందే.కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో… ఈ ఘటనకు సంబంధించి క్షుణ్ణంగా విచారణ జరిపించాలని.

 Rahul Gandhi's Team Meets President,  Rahul Gandhi, Likhimpur, Priyanka Gandhi-TeluguStop.com

ఇందుకు సంబంధించి ఇద్దరు సుప్రీం జడ్జీలను నియమించాలని రాష్ట్రపతిని కోరారు.అంతేకాకుండా కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.

లఖింపూర్ ఘటనకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నమ్మకాలను కోల్పోయాయని ప్రియాంక గాంధీ తెలిపారు.

ఇదే తరుణంలో బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు … వ్యవహరించిన తీరును రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో… లఖింపూర్ ఘటన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.విపక్షాలు తీవ్రస్థాయిలో రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు… దారుణంగా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు.

ఇదే తరుణంలో రైతులను పరామర్శించడానికి వెళ్తున్న నాయకుల పట్ల బీజేపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉండటంతో ఉన్న కొద్ది లఖింపూర్… ఘటన పెద్దదవుతుంది.ఇప్పటికే రైతులకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుండడంతో… ఇదే సమయంలో రైతుల పై కేంద్ర మంత్రి కొడుకు వాహనం దూసుకెళ్లి పోవడంతో.

బీజేపీ ఈ విషయంలో డిఫెండ్ చేసుకోలేని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube