టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటీఆర్ ? 

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల హడావుడిలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ,ఇప్పుడు మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.ఎప్పటి నుంచో టిఆర్ఎస్ అధ్యక్షుడు బాధ్యతలతో పాటు,  తెలంగాణ సీఎం పదవి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నా,  ఎప్పటికప్పుడు ఆ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది.

 Opportunity For Ktr To Assume Trs Presidential Responsibilities, Kcr, Ktr, Hujur-TeluguStop.com

రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం,  తదితర కారణాలతో కెసిఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.  అయితే ఎప్పటికైనా కేటీఆర్ ను సీఎం కుర్చీలో చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయినట్టు గా కనిపిస్తోంది.ప్రస్తుతం పార్టీ సంస్థాగత ఎన్నికల పై దృష్టిసారించారు.

ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా,  పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న అధ్యక్షుడి ఎంపిక జరగబోతున్న ట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఈ నెల 17 వ తేదీన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు పూర్తి కావడంతో ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఎన్నిక పై దృష్టి సారించారు.

హైదరాబాద్ లోని హెచ్.ఐ.ఐ సీ ప్రాంగణంలో ఈనెల ఐదో తేదీన జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి , అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు.ఈ విషయం స్వయంగా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని కేటీఆర్ ప్రకటించారు ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, తరువాత నామినేషన్ల పరిశీలన ఉంటుందని , 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించనున్నారు.ఈ ఎన్నికల్లో కేసీఆర్ నామినేషన్ వేయడంతో పాటు , అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
 

Telugu Congress, Hujurabad, Ktr Trs, Trs, Trs Kcr-Telugu Political News

ఇప్పటికే అనేకసార్లు ఆయన ఈ పదవిని వాయిదా పడుతూ వస్తుండడంతో ఇదే సరైన సమయంగా భావిస్తున్నారని టిఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.టిఆర్ఎస్ కాంగ్రెస్ లు రోజు రోజు కీ బలపడుతూ ఉండడంతో కేటీఆర్ కు ఈ బాధ్యతలు అప్పగించి పూర్తిస్థాయిలో పార్టీపై పట్టు పెరిగేలా చేయడంతో పాటు , తాను తెర వెనుక ఉండి పార్టీ కార్యక్రమాలు పరిరక్షించాలనే ప్లాన్ లో కేసీఆర్ అన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube