ప్రాణాలు కాపాడిన మోటో జీ5 స్మార్ట్ ఫోన్‌.. ఎలాగంటే...

ప్ర‌మాదం ఎప్పుడు ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌ర‌మూ చెప్ప‌లేం.దాన్ని ప‌సిగ‌ట్టి జాగ్ర‌త్త ప‌డితే బ‌తికి బ‌ట్ట‌క‌డుతాం.

 Moto G5 Smartphone That Saved Lives Somehow, Moto G5 Smartphone, Viral News, Bra-TeluguStop.com

లేదంటే మాత్రం దానికి ఆహుతి కావాల్సిందే.మ‌నం సోష‌ల్ మీడియాలో చూసే కొన్ని వీడియోల్లో అనుకోకుండా ప్ర‌మాదాలు వాటంత‌ట అవే వ‌స్తుండ‌టం చూస్తాం.

ఇలా అనుకోకుండా జ‌రిగేప్ర‌మాదాల్లో ప్రాణాలు కూడా విడుస్తారు చాలామంది.అయితే ఇలా అనుకోని ప్ర‌మాదంలో ఓ స్మార్ట్‌ఫోన్ ప్రాణాల‌ను నిల‌బెట్టింది.

విన‌డానికి విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం.ఫోన్ అంటే కేవ‌లం అవసరాలకు వాడుకోవడం మాత్ర‌మే మ‌న‌కు తెలుసు.

కానీ ఇప్పుడు తెలుసుకోబోయే వార్త‌లో ఓ ఫోన్ మ‌నిషి ప్రాణాల‌ను కాపాడింది.మోటరోలాలో ఈ విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకుంది.విష‌యం ఏంటంటే బ్రెజిల్‌లో ఓ దొంగతనం జరిగుతున్న టైమ్‌లో దుండ‌గులు అక్ర‌మాల‌కు తెగ‌బ‌డ్డారు.అక్కడే నిల్చున్న ఓ వ్యక్తి మీద ఆ కిరాత‌ల‌కులు ఏకంగా తుపాకీతో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.

అయితే ఆ స‌మయంలో ఆ వ్య‌క్తి జేబులో ఉండే మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌కు ఆ బుల్లెట్ అత్యంత వేగంగా త‌గిలి ప‌క్క భాగానికి దిశ మారిపోయింది.ఆ త‌ర్వాత ఆ బుల్లెట్ నడుము భాగంలోకి వెళ్లి తీవ్ర గాయాలు అవుతాయి.

Telugu Brazil, Bullet, Moto Smartphone, Robbers, Saved-Latest News - Telugu

కాగా ఇలా చిన్నపాటి గాయంతో ఆ వ్య‌క్తి బ‌య‌ట‌ప‌డ్డాడు.కానీ ఆ జేబులో ఫోన్ లేక‌పోతే మాత్రం అత‌ని ప్రాణాలు గాల్లో క‌లిసిపోయేవి.ఇంకో విష‌యం ఏంటంటే అత‌నికి ఆ బుల్లెట్ వల్ల క‌డుపులో అయిన గాయం కాక ఇతర గాయం ఏదీ కూడా కాక‌పోవ‌డం ఇక్క‌డ విశేషం.ఇక అత‌నికి ట్రీట్ మెంట్ చేసే క్ర‌మంలో ఆ డాక్ట‌ర్లు దాన్ని అన‌గా ఆ ఫోన్‌ను వీడియోలు, ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయ‌గా విప‌రీంగా వైర‌ల్ అవుతున్నాయి.

ఆ ఫోన్‌కు బుల్లెట్ తాక‌డంతో పూర్తిగా పాడైపోయింది.దీన్ని చూసిన వారంతా అదృష్ట వంతుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube